Afghanistan Bomb Blasts Explosion Kills 9 Children
Afghanistan bomb Blasts Explosion kills 9 children : అఫ్ఘానిస్థాన్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అఫ్ఘాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు అయినా బాంబు పేలుళ్లు మాత్రం ఆగటంలేదు. ఈ క్రమంలో సోమవారం (జనవరి 10,2022) మరోసారి బాంబు పేలుడుతో అఫ్ఘానిస్థాన్ దద్దరిల్లింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఓ స్కూల్ వద్ద సంభవించిన ఈ పేలుడులో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ఘటనను తాలిబన్ ప్రభుత్వం ధృవీకరించింది.
Read more : Telangana : నల్గొండ జిల్లా నరబలి ? మృతుడికి మతిస్ధిమితం లేదు
నంగర్‌హర్‌లోని లాలోపూర్‌లోని ఓ స్కూల్ ముందు ఆహార పదార్థాలు విక్రయిస్తున్న ఓ వాహనంలో పేలుడు సంభవించిందని తాలిబాన్ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. ఈ వాహనంలో మోర్టార్ ఉందని..వాహనం లాలోపూర్ జిల్లా పోస్ట్ వద్దకు చేరుకోగానే అది పేలిందని కొన్ని నివేదికలు వెల్లడించాయి.
కాగా అఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పనుంచి కొత్త పాలనను లక్ష్యంగా చేసుకుని అనేక దారుడలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ యాక్టివ్ గా ఉన్న ప్రాంతంలో పేలుడు జరగటం గమనించాల్సిన విషయం. ఐసిస్ (ISIS) ఆధీనంలో ఇక్కడ పాకిస్తాన్ చెక్ పోస్ట్‌లు ..ముళ్ల కంచెలున్న నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని లాలోపూర్ ప్రాంతంలో పేలుడు జరిగిందని మీడియాలు వెల్లడించాయి. తాలిబన్ చెక్ పోస్టులపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సంస్థ 2014 నుంచి ఈ ప్రాంతంలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతోంది. అఫ్ఘానిస్థాన్ లో కూడా పలు దాడులు జరిపింది. వీరి దాడులు చాలా వరకు షియా మైనారిటీలపైనే జరుగుతుండటం గమనించాల్సిన విషయం.
Read more : Telangana : నల్గొండ జిల్లాలో నరబలి టెన్షన్! హతుడి గుర్తింపు-లభ్యం కాని మొండెం
కాగా స్కూల్ దగ్గర జరిగిన ఈ పేలుడుపై మీడియాలో రకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. ఆహార పదార్థాలు రవాణా అవుతున్నాయని కొన్ని నివేదికలు చెబుతుంటే..మరోవైపు భూమిలో ఉంచిన మోర్టార్ పై బరువుపడటం వల్ల పేలిందని చెబుతున్నాయి. ఇలా పేలుడు ఘటన గురించి విభిన్న కథనాలు వెలువడుతున్నాయి. కాగా నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని ఒక పట్టణంలో గత డిసెంబర్ లో కూడా ఓ పేలుడు సంభవించి నలుగురు మహిళలు సహా ఏడుగురు మరణించారు.