Afghan Crisis : అఫ్ఘాన్‌లో మహిళా మంత్రిత్వశాఖ పేరు మార్చేసిన తాలిబన్లు! ఏం పెట్టారంటే

అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖ పేరునే మార్చిపారేశారు.

Talibans changed the name of Women Affairs ministry : అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్నాక తాలిబన్లు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారు. ప్రజలు తిండి లేకి ఆకలి కేకలు పెడుతుంటే వారు మాత్రం విందు వినోదాల్లో తేలుతున్నారు. ప్రజలకు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో అత్యంత నిర్ధయగా వ్యవహరిస్తున్నారు. అఫ్గాన్ పై తాలిబన్లు పట్టుకోయాక గత 20ఏళ్లుగా గత 20 ఏళ్లుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఆప్ఘనిస్థాన్ మహిళలకు మళ్లీ గడ్డుకాలం ఎదురైంది.

Read more : Hari Singh Nalwa..అప్ఘాన్ లపై అనేక యుద్ధాలు చేసి గెల్చిన సిక్కు యోధుడు గురించి తెలుసా

షరియా చట్టాల పేరుతో మహిళల స్వేచ్ఛపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. పలు ఆంక్షలను విధిస్తున్నారు. గడపదాటితే కాళ్లు విరిచేస్తామని కాల్చిపారేస్తామని హెచ్చరిస్తున్నారు. బాలికలకు విద్యను నిరాకరించిన తాలిబన్లు అంతర్జాతీయంగా వివర్శలు వెల్లువెత్తటంతో ఒక మెట్టు దిగారు. అమ్మాయిలకు ప్రత్యేక స్కూల్స్ ఉండాలని…ఒకవేళ కోఎడ్యుకేషన్ కొనసాగినా… అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య పరదా (తెర)ను ఏర్పాటు చేయాలని షరతు విధించారు.అక్కడితో వారి వివక్ష ఆగలేదు. అధికారికంగా కూడా పెను మార్పులు చేసిపారేస్తున్నారు.

Read more : Afghanistan : ప్రజాస్వామ్యం ఉండదు..షరియా మాత్రమే..తాలిబన్ క్లారిటీ

ఈక్రమంలో తాలిబన్లు మరో సంచనలనాత్మకమైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖ పేరునే మార్చిపారేశారు. గత 20 ఏళ్లుగా అఫ్గాన్ లో ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రిత్వ శాఖ భవనానికి ‘ధర్మ రక్షణ.. అధర్మ నిర్మూలన’ శాఖ అని పేరుపెట్టారు. దీనికి అరబ్బీ, దరి భాషల్లో బోర్డులు కూడా పెట్టారు. తాలిబన్ల కేబినెట్ లో మహిళకు స్థానం ఉందని అనుకోవటం కల్లే. అటువంటి తాలిబన్లు 1996-2001మధ్య అఫ్గాన్ ను పాలించిన క్రమంలో ఈ మంత్రిత్వ శాఖను మార్చేశారు. తిరిగి మరోసారి అఫ్గాన్ ను స్వాధీనం చేసుకుని తిరిగి అదే పద్ధతిని కొనసాగించనున్నారు. దీంట్లో భాగంగానే మహిళా మంత్రిత్వ శాఖ పేరును ‘ధర్మ రక్షణ.. అధర్మ నిర్మూలన’ శాఖగా పేరు మార్చేశారు.

Read more : Taliban : అసలు ఎవరీ తాలిబన్లు..వీళ్ల లక్ష్యం ఏంటీ!

ఇది శుక్రవారం (సెప్టెంబర్ 17,2021)జరిగింది. కానీ గురువారం నుంచి మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేసే మహఇళా ఉద్యోగులను తాలిబన్లు భవనంలోకి రాకుండా అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది.మరోవైపు ఇటీవలే విమానాశ్రయ సెక్యూరిటీలో 16 మంది మాజీ మహిళా ఉద్యోగులను మళ్లీ నియమించిన తాలిబన్లు… ఇతర శాఖలు, సంస్థల్లో మాత్రం మహిళలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

 

ట్రెండింగ్ వార్తలు