Afghanistan President : అష్రఫ్ ఘనీ తమ దేశంలో ఉన్నాడన్న యూఏఈ

గత ఆదివారం తాలిబన్లు రాజధాని కాబూల్ ని ఆక్రమించడంతో దేశం వదిలిపారిపోయిన అప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఎక్కడున్నాడనేదానిపై సృష్టత వచ్చింది.

Afghanistan President : అష్రఫ్ ఘనీ తమ దేశంలో ఉన్నాడన్న యూఏఈ

Ghani (1)

Updated On : August 18, 2021 / 7:54 PM IST

Afghanistan President గత ఆదివారం తాలిబన్లు రాజధాని కాబూల్ ని ఆక్రమించడంతో దేశం వదిలిపారిపోయిన అప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఎక్కడున్నాడనేదానిపై సృష్టత వచ్చింది. అష్రఫ్ ఘనీ ఉబ్జెకిస్తాన్ లో ఉన్నట్లు మొదట్లో వార్తలు రాగా, ఆ తర్వాత ఒమన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అష్రఫ్ ఘనీ,ఆయన కుటుంబం ఇప్పుడు యూఏఈలో ఉన్నట్లు తేలింది.

మానవత్వం దృష్ట్యా అష్రఫ్ ఘనీ కి తాము ఆశ్రయం కల్పించినట్లు యూఏఈ బుధవారం ప్రకటించింది. యూఏఈ విదేశాంగ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వశాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మానవతా ప్రాతిపదికన అష్రఫ్ ఘనీ మరియు అతని కుటుంబాన్ని దేశానికి స్వాగతించినట్లు ఆ ప్రకటనలో యూఏఈ పేర్కొంది. అయితే ఘనీ యూఏఈలోని ఏ సిటీలో ఉన్నాడన్నది మాత్రం ఆ ప్రకటనలో చెప్పలేదు.

READ Afghanistan: కార్లు,హెలికాఫ్టర్ నిండా డబ్బుతో..అప్ఘానిస్తాన్ నుంచి పారిపోయిన ఘనీ