Afghan Talibans :యుద్ధ విమానం రెక్కకు ఊయల కట్టి ఊగుతున్న తాలిబన్లు
అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఓ యుద్ధ విమానం రెక్కకు ఊయల కట్టి ఊగుతు సంబరాలు చేసుకుంటున్నారు.

Afghan Talibans
Talibans have turned their planes into swings : అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్ల అరాచాకాలకు వారి ఉగ్ర ఉన్మోదానికి అంతులేకుండా పోతోంది. తాలిబన్లు సాటి మనుషుల్ని హింసించటంలోనే కాదు ఆనందాన్ని వ్యక్తంచేయటంలో కూడా ఉన్మాదమే కనిపిస్తోంది. ఎవరన్నా చెట్టుకు కట్టి ఊయల ఊగుతారు. కానీ తాలిబన్ల ఉన్మాదమే వేరు..ఈ భారీ యుద్ధ విమానం రెక్కకు ఊయల కట్టి ఊగుతు సంబురాల్లో మునిగితేలిపోతున్నారు. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చైనా విదేశాంగ మంత్రి శాఖలోనే ఓ అధికారి పోస్ట్ చేయటం మరో గమనించాల్సిన విషయం.
Read more : Rohullah Saleh : అప్ఘాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లా సోదరుడిని హింసించి కాల్చిచంపిన తాలిబన్లు
ఇటు అప్గాన్లకు మద్దతు ఇస్తు భారత్ పై మండిపడుతు..అమెరికాపై విరుచుకుపడుతున్న చైనా శతృవుకు శతృవు మిత్రుడు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో చైనా విదేశాంగశాఖకు చెందిన అధికారి లిజైన్ ఝావో తన ట్విట్టర్ లో తాలిబన్లు విమానం రెక్కకు ఊయల ఊగుతున్న తాలిబన్ల మీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అమెరికాపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారం చెలాయిస్తు..త్వరలోనే అధికారాన్ని చేపట్టనున్న తాలిబన్లు సరదా సంబరాల్లో మునిగి తేలుతున్న వీడియోను షేర్ చేసిన అధికారి లిజైన్ ఝావో అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది పాలకుల కాలం నాటి శ్మశాన వాటిక. వారి యుద్ధ విమానాలు. ఆ విమానాలను తాలిబన్లు ఊయలలా, ఆట వస్తువుల్లా మార్చుకుంటున్నారు’’ అంటూ పేర్కొన్నారు.
Read more : Afghanistan : పంజ్‌షీర్‌లో ఇంటినుంచి ఈడ్చుకొచ్చి చంపుతున్న తాలిబన్లు
తాలిబన్లు ఊయల ఊగుతున్న ఆ ప్రాంతం గతంలో అమెరికా బలగాల స్థావరం కావటం గమనించాల్సిన విషయం. అమెరికా బలగాలు వారి దేశానికి మళ్లిపోగా..అదే అదనుగా కాచుకుని కూర్చున్న తాలిబన్లు అఫ్గాన్న ను హస్తగతం చేసుకున్నాయి.కాగా..యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ నుండి 2001-2021 యుద్ధం ముగిసిన తరువాత ఆగస్టు 30 న ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ ఉపసంహరించుకన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్లు 20 ఏళ్ల తరువాత తిరిగి అఫ్గాన్ ను తిరిగి వశం చేసుకున్నారు.
The graveyard of EMPIRES and their WAR MACHINES. Talibans have turned their planes into swings and toys….. pic.twitter.com/GMwlZKeJT2
— Lijian Zhao 赵立坚 (@zlj517) September 9, 2021