Afghanistan Girls: వచ్చే వారం నుంచి పాఠశాలలకు వెళ్లనున్న అఫ్గాన్ బాలికలు

బాలికలు పాఠశాలలకు వెళ్లి చదువుకునే విధంగా తాలిబన్ నేతలు అనుమతులు ఇచ్చారు. వచ్చే వారం నుంచి అఫ్గాన్ బాలికలు పాఠశాలలకు వెళ్లనున్నరు

Afghanistan Girls: తాలిబన్లచే దురాక్రమణకు గురై..ఆందోళనకర స్థాయిలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్న అఫ్గానిస్తాన్లో పరిస్థితులు ఇప్పుడిపుడే కుదుటపడుతున్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలో దేశంలో బాలికలు పాఠశాలలకు వెళ్లి చదువుకునే విధంగా తాలిబన్ నేతలు అనుమతులు ఇచ్చారు. అఫ్గాన్ లో బాలికలను చదువుకునేందుకు అనుమతించాలంటూ అంతర్జాతీయ సమాజాల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు తాలిబన్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అఫ్గానిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ సమాజాన్ని అంతర్జాతీయంగా గుర్తించాలంటూ కొన్ని రోజుల క్రితం తాలిబన్ నేతలు పశ్చిమదేశాల ప్రతినిధులతో నార్వేలో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా అఫ్ఘాన్ లో తీవ్ర స్థాయిలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేసాయి. ముఖ్యంగా మహిళలు, బాలికలు, విలేఖర్లపై తాలిబన్ల అకృత్యాల గురించి వారు ప్రశ్నించారు.

Also read: US-Russia Words: అఫ్గాన్, ఇరాక్ యుద్ధంలో అమెరికా పోగొట్టుకున్న సైనికుల కంటే ఎక్కువగా రష్యా సైనికులు మృతి

దీనిపై తాలిబన్ నేతలు స్పందింస్తూ.. పశ్చిమ దేశాలు భావిస్తున్నట్టుగా అఫ్గాన్ లో మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలు జరగడంలేదని పేర్కొన్నారు. ఈక్రమంలో దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను మిగతా ప్రపంచ దేశాలు నమ్మబలికేలా బాలికలను పాఠశాలలకు పంపి చదువుకునేలా తాలిబన్ నేతలు వెసులుబాటు కల్పించారు. అయితే వారు బాలురతో కలిసి ఒకే గదిలో కూర్చోకూడదని షరతు విధించారు. బాలికల కోసం ప్రత్యేక తరగతులు, మహిళా ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని విద్యా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అజీజ్ అహ్మద్ రేయాన్ పేర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయులు లేని పక్షంలో పురుష ఉపాధ్యాయులను అనుమతిస్తామని వెల్లడించారు. ఇప్పటికైతే దేశంలో ఎక్కడా పాఠశాలలు మూసివేయలేదని, విద్యాశాఖ ఎంతో భాద్యతగా వ్యవహరిస్తుందని తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు.

Also read: Russia Ukraine war: రష్యా సైనికులను దొంగలను చేసిన యుద్ధం

ట్రెండింగ్ వార్తలు