US-Russia Words: అఫ్గాన్, ఇరాక్ యుద్ధంలో అమెరికా పోగొట్టుకున్న సైనికుల కంటే ఎక్కువగా రష్యా సైనికులు మృతి

22 రోజులుగా సాగుతున్న భీకర యుద్ధంలో ఇప్పటివరకు 7 వేలమందికి పైగా రష్యా సైనికులు మృతి చెందారని అమెరికా నిఘావర్గాలు వెల్లడించాయి.

US-Russia Words: అఫ్గాన్, ఇరాక్ యుద్ధంలో అమెరికా పోగొట్టుకున్న సైనికుల కంటే ఎక్కువగా రష్యా సైనికులు మృతి

Russia Ukriane

US-Russia Words: 20 ఏళ్లపాటు జరిగిన అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధాల సమయంలో అమెరికా పోగొట్టుకున్న సైనికుల సంఖ్యకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ప్రస్తుతం రష్యా తన సైనికులను కోల్పోయిందని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. యుక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో ఊహించిన దానికంటే ఏక్కువగా రష్యా తన సైనికులను కోల్పోతుందని అమెరికా తెలిపింది. 22 రోజులుగా సాగుతున్న భీకర యుద్ధంలో ఇప్పటివరకు 7 వేలమందికి పైగా రష్యా సైనికులు మృతి చెందారని అమెరికా నిఘావర్గాలు వెల్లడించాయి. ఈ సంఖ్య అఫ్గాన్, ఇరాక్ యుద్ధంలో అమెరికా పోగొట్టుకున్న సైనికుల కంటే ఎక్కువని యూఎస్ ఇంటెలిజెన్స్ వెల్లడించాయి. అయితే రష్యా మాత్రం ఇప్పటివరకు 500 మంది సైనికులు మాత్రమే మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించింది.

Also read: Russia Ukraine war: రష్యా సైనికులను దొంగలను చేసిన యుద్ధం

యుద్ధం కారణంగా 21,000 మంది రష్యా సైనికులు గాయపడ్డారని, ఇది యుక్రెయిన్ పై దాడికి రష్యా పంపిన బలగాల సంఖ్యలో 20 శాతానికి సమానం అని యూఎస్ నిఘావర్గాలు వెల్లడించాయి. అంటే మొత్తం 1,50,000 మంది రష్యన్ బలగాలలో దాదాపు 20 శాతం మంది ప్రస్తుతం యుద్ధంలో లేరు. అయితే రష్యా బలగాలు వెనక్కు తగ్గకపోవడంతో యుక్రెయిన్ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. రష్యా బలగాలను సమర్ధంగా తిప్పికొట్టేందుకు యుక్రెయిన్ కు అమెరికా అత్యాధునిక ఆయుధాలు అందించనుంది. దీంతో యుద్ధం మరింత భీకరంగా సాగొచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇక యుద్ధం కారణంగా దాదాపు 1,300 మంది యుక్రెయిన్ సైనికులు మృతి చెందినట్లు యుక్రెయిన్ అధికారులు ధ్రువీకరించారు.

Also read: Zelensky: యుక్రెయిన్ ప్రెసిడెంట్ పేరుతో అస్సాంలో టీ పొడి, కారణమిదే..

మరోవైపు రష్యాపై యుద్ధంలో యుక్రెయిన్ ఆత్మరక్ష నిమిత్తం అవసరమైన ఆయుధాలను ఇతర అవసరాలను తీర్చేవిధంగా అమెరికా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. యుక్రెయిన్‌కు అదనంగా $800 మిలియన్ల భద్రతా సహాయాన్ని అందిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. $ 800m ప్యాకేజీలో భాగంగా 800 స్ట్రింగర్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్; 2,000 జావెలిన్, 1,000 తేలికపాటి యాంటీ-ఆర్మర్ ఆయుధాలు మరియు 6,000 AT-4 యాంటీ-ఆర్మర్ సిస్టమ్స్; 100 టాక్టికల్ అన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్; 100 గ్రెనేడ్ లాంచర్లు, 5,000 రైఫిల్స్, 1,000 పిస్టల్స్, 400 మెషిన్ గన్లు మరియు 400 షాట్‌గన్‌లు; 20 మిలియన్ రౌండ్ల చిన్న ఆయుధాల మందుగుండు సామగ్రి మరియు గ్రెనేడ్ లాంచర్ మరియు మోర్టార్ రౌండ్లు, 25,000 సెట్ల శరీర కవచాలు, హెల్మెట్లను అమెరికా యుక్రెయిన్ కు అందించనుంది.

Also read: Ukraine Russia War : యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుదశకు చేరుకుందా?