Ukraine Russia War : యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుదశకు చేరుకుందా?

నాటోలో చేరబోమని యుక్రెయిన్‌, చేర్చుకోబోమని అమెరికా, పశ్చిమ దేశాలు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ నాటో ఇందుకు అంగీకరించలేదు.

Ukraine Russia War : యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుదశకు చేరుకుందా?

Russia Ukraine

Ukraine Russia war : యుక్రెయిన్ యుద్ధం ముగింపుదశకు చేరుకుందా…? యుద్ధం మూడోవారంలో ప్రవేశించిన తర్వాత రెండు దేశాల మధ్య సంప్రదింపులకు, సానుకూల ధోరణికి దారి దొరికిందా….? అసలే కారణాన్ని చూపుతూ రష్యా యుక్రెయిన్ ఆక్రమణ ప్రారంభించిందో…అది చేయనేచేయబోమని జెలన్‌స్కీ చేసిన ప్రకటన పుతిన్‌ను శాంత పరిచిందా. .? యుద్ధం ముగిసే మార్గం కోసం రెండు దేశాలు ఎదురుచూస్తున్నాయా….? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

రష్యా సరిహద్దులదాకా నాటోను విస్తరించాలన్న అమెరికా సంకల్పం….యుక్రెయిన్‌లో తమ మాట చెల్లుబాటయ్యే ప్రభుత్వం ఉండాల్సిన రష్యా అనివార్యత… 22 రోజుల క్రితం పుతిన్ స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించడానికి కారణమైంది. యుద్ధం మొదలుపెట్టడానికి ముందు…పుతిన్ ప్రపంచానికి సూటిగా ఈ విషయం చెప్పారు. యుక్రెయిన్‌ను నాటోలో చేర్చుకునేందుకు ఓ వైపు సన్నాహాలు చేస్తూ…మరోవైపు యుక్రెయిన్‌పై యుద్ధానికి దిగొద్దంటూ హితోపదేశం చేస్తున్న పాశ్చాత్య దేశాలకు స్పష్టంగానే విషయం తేల్చిచెప్పారు.

Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య 22వ రోజు భీకర పోరు.. ఐసీజే తీర్పును తిరస్కరించిన పుతిన్

నాటోలో చేరబోమని యుక్రెయిన్‌, చేర్చుకోబోమని అమెరికా, పశ్చిమ దేశాలు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ నాటో ఇందుకు అంగీకరించలేదు. ఏ దేశానికైనా నాటోలో సభ్యత్వం కల్పించే అధికారం తమకుందని వాదించాయి. అటు జెలన్‌స్కీ కూడా తాము చేరబోతున్న నాటో కూటమి తమకు అన్నివిధాలా అండగా ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. పుతిన్ హెచ్చరికను పెడచెవిన పెట్టారు. ఫలితంగా యుక్రెయిన్ యుద్ధభూమిగా మారింది. యుద్ధం అనుకున్నదానికన్నా సుదీర్ఘంగా సాగుతూ యుక్రెయిన్‌ను మరుభూమిగా మార్చివేసింది.

ఆదుకుంటాయనుకున్న అమెరికా, నాటో ఆయుధాలు అందించడంతో సరిపుచ్చడంతో..జెలన్‌స్కీకి తెలివి వచ్చింది. నాటో నట్టేటముంచిందని అర్ధం చేసుకున్నారు. యుద్ధం మొదలయిన తొలిరోజుల్లో తమను నాటోలో చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని..పశ్చిమ దేశాలను కోరిన జెలన్‌స్కీ.. పోరు రెండువారాలు చేరుకునే సమయానికి..తన ప్రతిపాదన వెనక్కి తీసుకున్నారు. పుతిన్ కోరినట్టుగా నాటోలో యుక్రెయిన్‌ చేరబోదని ప్రకటించారు. రష్యాకు స్వయంగా ఈ హామీని అందించేందుకు యుక్రెయిన్ సిద్ధమయింది. దీంతో మరికొన్నిరోజుల్లో యుద్ధం ముగిసే ఆశ కనిపిస్తోంది.

US Drones: యుక్రెయిన్ కోసం అమెరికా నుంచి డ్రోన్ ఆయుధాలు

అసలు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, నాటోలో చేరబోమని, నాటో బలగాలకు పరిధి విధిస్తామని యుక్రెయిన్ ప్రకటించగానే…రష్యా బలగాలు యుక్రెయిన్‌ నుంచి వెనక్కిమళ్తాయని కీవ్ ఇండిపెండెంట్ నిన్న ప్రకటించినట్టు వార్తలొచ్చాయి. రష్యా, యుక్రెయిన్ ప్రతినిధుల మధ్య వచ్చే సోమవారం జరగబోయే మరో విడత చర్చలపై రెండు దేశాలూ భారీగా ఆశలు పెట్టుకున్నాయి. మరోవైపు యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్టు వార్తలొస్తున్నప్పటికీ..యుక్రెయిన్‌లో విధ్వంసం ఆగలేదు.

మరియుపోల్‌లో వెయ్యిమంది ఉన్న ఓ డ్రామా థియేటర్‌పై రష్యా బలగాలు దాడిచేశాయని యుక్రెయిన్ ప్రకటించగా…రష్యా ఆ ఆరోపణలను ఖండించింది. అటు అమెరికా, నాటో దేశాల నుంచి యుక్రెయిన్‌కు అధునాతన ఆయుధాల సరఫరా ఆగడం లేదు. యుద్ధం భీతావహంగా కొనసాగుతున్నప్పటికీ త్వరలో ముగిసే సూచన ఉందని యుక్రెయిన్‌ కూడా నమ్ముతోంది. రష్యా సైనికులు…ఎక్కడివారక్కడే ఉండిపోయారని..రానున్న రోజుల్లో కాల్పుల విరమణ మొదలవుతుందని యుక్రెయిన్ అధ్యక్ష సలహాదారు వ్యాఖ్యానించారు.

Russia Putin : యుక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం రష్యాకు లేదు : పుతిన్

ఇరువైపులా సానుకూల వాతావరణం కనిపిస్తోందని, రష్యా అధ్యక్షులు పుతిన్..తన డిమాండ్లను కాస్త సడలిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. క్రిమియా రష్యాలో భాగమని యుక్రెయిన్ అంగీకరించడం, రష్యా గుర్తించిన తూర్పు యుక్రెయిన్ ప్రాంతాల స్వయంప్రతిపత్తిని ఆమోదించడం, నాటోలోనూ, ఈయూలో చేరబోనని హామీ ఇవ్వడం వంటివి రష్యా డిమాండ్ చేసింది. ప్రస్తుతానికి నాటోలో చేరబోనని యుక్రెయిన్ హామీ ఇస్తున్నప్పటికీ..మిగిలిన డిమాండ్లపై మాత్రం ఏ ప్రకటనా చేయలేదు.

చర్చల్లో వీటికి పరిష్కారం లభించే అవకాశముంది. అలాగే యుక్రెయిన్‌లో అధికారమార్పుకు కూడా రష్యా పట్టుబట్టకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చర్చలు వాస్తవధోరణిలో సాగాలన్నది జెలన్‌స్కీ ఆకాంక్ష. విదేశీ వ్యవహారాల్లో యుక్రెయిన్ తటస్థంగా ఉండాలని, సొంత ఆర్మీ, నావికాదళం మాత్రమే నిర్వహించుకోవాలని, పాశ్చాత్య దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడకూడదన్నది రష్యా అభిప్రాయం.