Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య 22వ రోజు భీకర పోరు.. ఐసీజే తీర్పును తిరస్కరించిన పుతిన్

యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యుక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను తక్షణం నిలిపివేయాలని రష్యాను ఆదేశించింది.

Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య 22వ రోజు భీకర పోరు.. ఐసీజే తీర్పును తిరస్కరించిన పుతిన్

Ukraine Russia

Russia Ukraine war : 22వ రోజు రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర పోరు నడుస్తోంది. యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను శ్మశానాలుగా మార్చేసిన రష్యన్ బలగాలు… తాజాగా కీవ్‌, ఖేర్సన్‌, మరియుపోల్‌పై విరుచుకుపడుతున్నాయి. రష్యన్ సైనికులు మిస్సైల్స్, బాంబుల వర్షం కురిపిస్తున్నారు.

మరోవైపు యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యుక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను తక్షణం నిలిపివేయాలని రష్యాను ఆదేశించింది. దాడులు నిలిపేయడంతో పాటు, యుక్రెయిన్‌ భూభాగంపై రష్యా సేనలు గానీ, దానికి మద్దతు ఇచ్చే సాయుధ దళాలు గానీ ఎటువంటి తదుపరి ఆపరేషన్లు చేపట్టకుండా చూడాలని స్పష్టం చేసింది.

Russia Putin : యుక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం రష్యాకు లేదు : పుతిన్

సైనిక చర్య కారణంగా పౌరులు కూడా బాధితులుగా మారుతున్నారని, ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే రష్యా అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను తిరస్కరించినట్లు పేర్కొంది. దీనిపై అంతర్జాతీయ న్యాయం హుటాహుటినా సమావేశం అయింది. రష్యా-యుక్రెయిన్‌ పరిణామాలపై చర్చిస్తోంది.

ఇక జర్మనీ పార్లమెంట్‌లో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ వర్చువల్ గా ప్రసంగించారు. రష్యాతో యుద్ధానికి తమకు సహకారం అందించాలని జెలెన్‌స్కీ జర్మనీని కోరారు. యుక్రెయిన్‌లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో జర్మనీ పార్లమెంట్‌కు వివరించారు. జెలెన్‌స్కీ ప్రసంగానికి జర్మనీ పార్లమెంట్ స్టాండింగ్ ఓవెషన్‌ ఇచ్చింది.