Russia Putin : యుక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం రష్యాకు లేదు : పుతిన్

కేవలం ఆత్మరక్షణ కోసమే యుక్రెయిన్‌పై సైనికచర్యకు దిగినట్లు పుతిన్ ప్రకటించారు. క్రిమియా, డాన్‌బాస్‌లపై దాడి చేయాలన్న యుక్రెయిన్ కుట్రను తాము సమర్ధంగా అడ్డుకున్నామని చెప్పారు.

Russia Putin : యుక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం రష్యాకు లేదు : పుతిన్

Putin (1)

Russian President Putin : యుక్రెయిన్‌పై తాము చేపట్టిన సైనిక చర్య సక్సెస్ అయిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. యుక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం తమ దేశానికి లేదన్నారు. యుక్రయిన్‌లో సైనిక చర్య ప్రారంభించడం తప్ప.. తమ దేశానికి వేరే మార్గం లేదన్నారు. కేవలం ఆత్మరక్షణ కోసమే యుక్రెయిన్‌పై సైనికచర్యకు దిగినట్లు పుతిన్ ప్రకటించారు. క్రిమియా, డాన్‌బాస్‌లపై దాడి చేయాలన్న యుక్రెయిన్ కుట్రను తాము సమర్ధంగా అడ్డుకున్నామని చెప్పారు. రష్యాపై కుట్రపూరిత స్పెషల్ ఆపరేషన్ జరుగుతుందోన్నారు.

డొనెట్స్క్ ప్రాంతంలో ఇటీవల జరిగిన క్షిపణి దాడిని ఉగ్రవాద పిరికిపంద చర్యగా అభివర్ణించారు. పాశ్చాత్య దేశాలపై తీవ్రమైన దాడిచేసి రక్తపాతం కొనసాగిచేందుకు యుక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా చేస్తున్నారని పుతిన్ ఆరోపించారు. పాశ్చాత్య దేశాలకు తాము యాంటీ రష్యా పిలుపునిస్తే.. నాటో, దాని మిత్రదేశాలు క్యాన్సిల్ రష్యా కోరుకుంటున్నాయని చెప్పారు. రష్యా ఆర్ధిక వ్యవస్థతో పాటు ప్రతీ రష్యన్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా నాటో దేశాలు పనిచేస్తున్నాయని చెప్పారు.

Russia : యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన రష్యా విదేశాంగ మంత్రి

మరోవైపు యుక్రెయిన్, రష్యా యుద్ధానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందా..? ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరనుందా..? లేక యుద్ధం మరింత ఉధృతం అవుతుందా? అంటే రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు తాజాగా యుక్రెయిన్ ప్రకటనే కారణం. నాటో విషయంలో స్వీడన్, ఆస్ట్రియా దేశాల తరహాలో యుక్రెయిన్ కూడా తటస్థంగా ఉండాలన్న రష్యా ఆఫర్‌ను జెలెన్‌స్కీ ప్రభుత్వం తిరస్కరించింది. అలా ఉండటం కుదరదని తేల్చిచెప్పేసింది. ఈ ప్రకటనతో యుక్రెయిన్‌, రష్యా యుద్ధ విరమణపై సందిగ్దత నెలకొంది. దీంతో యుక్రెయిన్‌పై రష్యా దాడుల్ని మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది.

నాటోలో చేరలేమని ప్రజలు అర్థం చేసుకోవాలన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటనతో రష్యా సంతృప్తి చెందింది. జెలెన్‌స్కీ కామెంట్స్ తర్వాత రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లారోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని అంశాలపై ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే దశకు చర్చలు చేరాయని సెర్గీ లారోవ్ వ్యాఖ్యానించారు. అయితే తటస్థంగా ఉంటామని యుక్రెయిన్‌ హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో యుక్రెయిన్ కూడా తటస్థంగా ఉండాలన్నారు. ఇది గతంలోని డిమాండే. ఇప్పుడు మరోసారి రష్యా తెరపైకి తీసుకొచ్చినప్పటికీ…. దీనికి యుక్రెయిన్‌ కూడా నో చెప్పింది.

Ukraine Russia War : యుక్రెయిన్ భవితవ్యాన్ని బలి తీసుకుంటున్న యుద్ధం.. అంధకారంలో చిన్నారుల భవిష్యత్

ఇప్పటికే యుద్ధం దెబ్బకు యుక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు శ్మశానాలను తలపిస్తున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొన్నిచోట్ల శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. ఇటు రష్యాకు కూడా భారీ నష్టం వాటిల్లింది. మరోవైపు యుక్రెయిన్ టీవీ ఛానళ్లను హ్యాక్ చేశారు కొంతమంది హ్యాకర్లు. లైవ్‌ టీవీ స్క్రీన్లపై టెక్ట్స్ మేసేజ్ ప్రత్యక్షమవుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు లొంగిపోయాడని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని జెలెన్‌స్కీ కొట్టిపారేశారు. లొంగిపోం… ఇంకా పోరాడుతామని జెలెన్‌స్కీ అన్నారు.