Russia : యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన రష్యా విదేశాంగ మంత్రి

అయితే తటస్థంగా ఉంటామని యుక్రెయిన్‌ హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో యుక్రెయిన్ కూడా తటస్థంగా ఉండాలన్నారు.

Russia : యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన రష్యా విదేశాంగ మంత్రి

Russia

Russian foreign minister Sergey Lavrov : యుక్రెయిన్‌, రష్యా యుద్ధం ముగియనుందా…? ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరనుందా…? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నాటోలో చేరలేమని ప్రజలు అర్థం చేసుకోవాలన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటనతో రష్యా సంతృప్తి చెందినట్లు కనిపిస్తోంది. జెలెన్‌స్కీ కామెంట్స్ తర్వాత రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లారోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని అంశాలపై ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే దశకు చర్చలు చేరాయని సెర్గీ లారోవ్ వ్యాఖ్యానించారు.

అయితే తటస్థంగా ఉంటామని యుక్రెయిన్‌ హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో యుక్రెయిన్ కూడా తటస్థంగా ఉండాలన్నారు. ఇది గతంలోని డిమాండే అయినా దీనికి యుక్రెయిన్‌ కూడా అంగీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే యుద్ధం దెబ్బకు యుక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు శ్మశానాలను తలపిస్తున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొన్నిచోట్ల శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. ఇటు రష్యాకు కూడా భారీ నష్టం వాటిల్లింది.

Anti-Tank Missiles : రష్యాను భయపెడుతున్న యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌

ఇంతకీ రష్యా ఎందుకు శాంతికి ఒప్పుకుంటోంది. యుక్రెయిన్‌పై పునరాలోచనలో ఎందుకు పడింది…? ఇందుకు యాంటీ ట్యాంక్ మిస్సైల్స్‌ కారణమని భావిస్తున్నారు. ఈ యుద్ధంలో రష్యా భారీగా యుద్ధట్యాంకులను కోల్పోయింది. వచ్చిన ట్యాంకులను వచ్చినట్లు యుక్రెయిన్ సైన్యం లేపేస్తోంది. దీంతో యుక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా సైన్యం ఇంతవరకు టచ్ చేయలేకపోయింది.

రష్యాపై యుక్రెయిన్‌ పైచేయి సాధించడానికి ఈ మిస్సైల్సే కారణమంటున్నారు రక్షణరంగ నిపుణులు. యుక్రెయిన్‌కు స్వీడన్‌ నుంచి 5వేలు, బ్రిటన్‌ నుంచి 3,615, నార్వే నుంచి 2వేల యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌ వచ్చాయి. జర్మనీ నుంచి కూడా యుక్రెయిన్‌కు మరో 1,000 యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌ చేరాయి. అమెరికా కూడా భారీగా యుక్రెయిన్‌కు జావెలిన్‌ మిస్సైల్స్‌ పంపింది.

Ukraine Russia War : యుక్రెయిన్ భవితవ్యాన్ని బలి తీసుకుంటున్న యుద్ధం.. అంధకారంలో చిన్నారుల భవిష్యత్

ఓవైపు యుద్ధం భీకరంగా జరుగుతోంది. 2 రోజులు దాటినా.. బాంబుల వర్షం తగ్గలేదు. మిస్సైల్స్ కూల్చివేత ఆగలేదు. కీవ్‌ టార్గెట్‌గా రష్యా బలగాలు ముందుకు కదులుతుంటే.. బేరాక్టర్లతో చుక్కలు చూపిస్తోంది యుక్రెయిన్. ఎక్కడికక్కడ ట్యాంకర్లను పేల్చేస్తే.. మిస్సైల్స్‌ను బ్లాస్ట్ చేస్తూ రష్యాను అడ్డుకుంటోంది. మరోవైపు.. ప్రపంచ దేశాల నుంచి యుక్రెయిన్‌ను అయుధాలు సమకూరుతూనే ఉన్నాయి.

ఇప్పటికే టర్కిష్ డ్రోన్లు, జావెలిన్ యాంటీ స్టింగర్లను సమకూర్చిన అమెరికా.. తాజాగా కిల్లర్ డ్రోన్‌లను యుక్రెయిన్‌కు పంపిస్తోంది. వీటి ద్వారా మైళ్ల దూరంలోని టార్గెట్‌ను ట్రాక్ చేసి బ్లాస్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే కిల్లర్ డ్రోన్‌లు.. యుక్రెయిన్‌కు కొత్త అస్త్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.