Ukraine Russia War : యుక్రెయిన్ భవితవ్యాన్ని బలి తీసుకుంటున్న యుద్ధం.. అంధకారంలో చిన్నారుల భవిష్యత్

ఒకప్పుడు యుక్రెయిన్‌లో ఉదయాలు ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరంగా ఉండేవి. ఆ దేశ చిన్నారులు భూమ్మీది సంతోషమంతా తమతోనే ఉందన్నట్టుగా జీవించేవారు. ఇప్పుడు సైరన్ మోతలతో నిద్ర లేస్తున్నారు.

Ukraine Russia War : యుక్రెయిన్ భవితవ్యాన్ని బలి తీసుకుంటున్న యుద్ధం.. అంధకారంలో చిన్నారుల భవిష్యత్

War

Ukraine Russia war : యుద్ధంలో రష్యా ఏం సాధించిందో…యుక్రెయిన్ ఏం పోగొట్టుకుందో…..భారీగా ఆయుధాల సరఫరాతో అమెరికా, నాటో దేశాలు ఏం ప్రయోజనం పొందాయో తెలియదు కానీ…యుక్రెయిన్ భావి పౌరులు మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. యుద్ధం ఎందుకు జరుగుతుంది.. ఇందులో ఎవరి ప్రయోజనాలు ఏంటి అన్న సంగతి పక్కన పెడితే… కొన్ని తరాల భవిష్యత్తును యుద్ధం అంధకారంలోకి నెట్టేసింది.

ప్రతి సెకనుకు ఒకరు…ప్రతి నిమిషానికి 55 మంది…ప్రతి రోజూ 75 వేల మంది….యుక్రెయిన్‌ యుద్ధంతో శరణార్థులుగా మారుతున్న చిన్నారుల సంఖ్య ఇది. 21 రోజుల క్రితం అమ్మానాన్న, బంధువులు, స్నేహితులతో సంతోషంగా సాగిన బాల్యానికి ఇప్పుడు..బతుకు భారంగా మారింది. బాంబుల వర్షం, క్షిపణుల దాడులు, యుద్ధ విమానాలతో పరాయి దేశం, సొంత దేశం సైనికుల మధ్య భీతావహంగా సాగుతున్న యుద్ధం…యుక్రెయిన్ భవిష్యత్తును బలికోరుతోంది. సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో పొరుగుదేశాలకు పయనమవుతున్నారు చిన్నారులు.

Russia Ukraine War : యుక్రెయిన్‌లో నో- ఫ్లై జోన్ విధించాలి.. నాటోకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి..!

ఒకప్పుడు యుక్రెయిన్‌లో ఉదయాలు ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరంగా ఉండేవి. ఆ దేశ చిన్నారులు భూమ్మీది సంతోషమంతా తమతోనే ఉందన్నట్టుగా జీవించేవారు. కానీ 21 రోజుల నుంచీ సైరన్ మోతలతో నిద్ర లేస్తున్నారు. ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నారు. కడుపునిండా తిండి లేదు. కంటి నిండా నిద్రలేదు. అసలు కాలు తీసి కాలు పెట్టే స్థలమే లేదు. నివాసమున్న భవనంపైకి ఏ క్షణమైనా మిస్సైల్ దూసుకురావొచ్చు.

యుద్ధవిమానం విసిరిన బాంబులు ఎప్పుడైనా మీద పడొచ్చు. మరుక్షణం బతికే ఉంటామన్న గ్యారంటీ లేదు. రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయి. అమ్మనాన్నలు, అయినవారు అందరూ కళ్లముందే కన్నుమూస్తున్నారు. వారు అనాథలుగా మిగిలిపోతున్నారు. యుక్రెయిన్ యుద్ధం తర్వాత భూములు, నాయకత్వాలు ఎవరి చేతులు మారతాయో తెలియదు కానీ….. ఆ దేశం మాత్రం అతిపెద్ద సంక్షోభంలో కూరుకుపోతోంది.

Russia-Ukraine War : రష్యాకు తీరని దెబ్బ.. 21 రోజుల్లో నాల్గో మేజర్ జనరల్ మృతి..!

రష్యా దాడులు, ప్రతిదాడులు కలిగించే ఆస్తి నష్టం సంగతి పక్కనపెడితే…ఓ తరానికి తరం భవిష్యత్తంతా తగలబడిపోతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత…ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ప్రజలు వలస బాట పట్టారు. 30లక్షల మందికి పైగా యుక్రెయిన్ ప్రజలు..యుద్ధం విడిచి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి అంచనా. వారిలో 14లక్షలమంది చిన్నారులే. గడచిన 20 రోజుల్లో ప్రతిరోజూ 75వేలమంది పిల్లలు శరణార్థులుగా మారుతున్నారు.

కల్లోల పరిస్థితుల్లో దేశం దాటుతున్న చిన్నారులు అంతకుమించిన ప్రమాదకర పరిస్థితుల బారిన పడుతున్నారు. వెల్లువలా తరలిపోతున్న శరణార్థుల మధ్య తల్లిదండ్రుల నుంచి తప్పిపోతున్నారు. అయినవారికి దూరమవుతున్నారు. దిక్కూమొక్కూలేనివారవుతున్నారు. …లైంగిక హింస, అక్రమ రవాణా వంటివాటిల్లో చిక్కుకుపోతున్నారు. మొత్తంగా రష్యా ఆక్రమణ, యుక్రెయిన్ ప్రతిఘటన, నాటో, అమెరికా దేశాల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం అన్నీ కలిసి..యుక్రెయిన్ రేపటి ఆశలను ఛిదిమేస్తున్నాయి.