Anti-Tank Missiles : రష్యాను భయపెడుతున్న యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌

రష్యాపై యుక్రెయిన్‌ పైచేయి సాధించడానికి ఈ మిస్సైల్సే కారణమని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. యుక్రెయిన్‌కు స్వీడన్‌ నుంచి 5వేలు, బ్రిటన్‌ నుంచి 3,615 యాంటీ ట్యాంక్ లు వచ్చాయి.

Anti-Tank Missiles : రష్యాను భయపెడుతున్న యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌

Anti Tank Missiles

Anti-tank missiles : ఇంతకీ రష్యా ఎందుకు శాంతికి ఒప్పుకుంటోంది. యుక్రెయిన్‌పై పునరాలోచనలో ఎందుకు పడింది…? ఇందుకు యాంటీ ట్యాంక్ మిస్సైల్స్‌ కారణమని భావిస్తున్నారు. ఈ యుద్ధంలో రష్యా భారీగా యుద్ధట్యాంకులను కోల్పోయింది. వచ్చిన ట్యాంకులను వచ్చినట్లు యుక్రెయిన్ సైన్యం లేపేస్తోంది. దీంతో యుక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఇంతవరకు రష్యా సైన్యం టచ్ చేయలేకపోయింది.

రష్యాపై యుక్రెయిన్‌ పైచేయి సాధించడానికి ఈ మిస్సైల్సే కారణమని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. యుక్రెయిన్‌కు స్వీడన్‌ నుంచి 5వేలు, బ్రిటన్‌ నుంచి 3,615, నార్వే నుంచి 2వేల యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌ వచ్చాయి. జర్మనీ నుంచి కూడా యుక్రెయిన్‌కు మరో 1,000 యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌ చేరాయి. అమెరికా కూడా భారీగా యుక్రెయిన్‌కు జావెలిన్‌ మిస్సైల్స్‌ పంపింది.

India-Russia Deal : భారత్‌-రష్యా ఆయిల్ డీల్‌ చూసి కుళ్లుకుంటున్న అమెరికా

ఓవైపు యుద్ధం భీకరంగా జరుగుతోంది. 2 రోజులు దాటినా.. బాంబుల వర్షం తగ్గలేదు. మిస్సైల్స్ కూల్చివేత ఆగలేదు. కీవ్‌ టార్గెట్‌గా రష్యా బలగాలు ముందుకు కదులుతుంటే.. బేరాక్టర్లతో చుక్కలు చూపిస్తోంది యుక్రెయిన్. ఎక్కడికక్కడ ట్యాంకర్లను పేల్చేస్తే.. మిస్సైల్స్‌ను బ్లాస్ట్ చేస్తూ రష్యాను అడ్డుకుంటోంది. మరోవైపు.. ప్రపంచ దేశాల నుంచి యుక్రెయిన్‌ను అయుధాలు సమకూరుతూనే ఉన్నాయి.

ఇప్పటికే టర్కిష్ డ్రోన్లు, జావెలిన్ యాంటీ స్టింగర్లను సమకూర్చిన అమెరికా.. తాజాగా కిల్లర్ డ్రోన్‌లను యుక్రెయిన్‌కు పంపిస్తోంది. వీటి ద్వారా మైళ్ల దూరంలోని టార్గెట్‌ను ట్రాక్ చేసి బ్లాస్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే కిల్లర్ డ్రోన్‌లు.. యుక్రెయిన్‌కు కొత్త అస్త్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.