India-Russia Deal : భారత్‌-రష్యా ఆయిల్ డీల్‌ చూసి కుళ్లుకుంటున్న అమెరికా

యుక్రెయిన్‌ యుద్ధంలో తటస్థ వైఖరి ప్రదర్శిస్తోన్న భారత్‌ను చూసి అమెరికా ఓర్వలేక విష ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఏ దేశానికి మద్దతివ్వని భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది.

India-Russia Deal : భారత్‌-రష్యా ఆయిల్ డీల్‌ చూసి కుళ్లుకుంటున్న అమెరికా

India Russia

India-Russia Deal : భారత్‌కు రష్యా బంపర్‌ ఆఫర్‌పై అమెరికాకు ఎందుకంత ఒళ్లుమంట..? రష్యా-భారత్ స్నేహం చూసి ఎందుకంత కుళ్లు..? చమురు డీల్‌పై పెద్దన్నకు ఎందుకంత కడుపుమంట? ఎందుకంటే అమెరికా బుద్ధే అంత కదా..! పక్కనొడిని చూసి ఏడవడం తన నైజం కదా..! దొంగదెబ్బలు తీయడం.. నమ్మించి మోసం చేసే పాకిస్థాన్‌ లాంటి దేశాలకు అది మిత్రపక్షం కదా..! అందుకే అగ్రరాజ్య ఏడుపులు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి..! అవును..! భారత్‌కు రష్యా తక్కువ ధరకు ముడి చమురును సరఫరా చేయడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. యుక్రెయిన్‌ యుద్ధంలో తటస్థ వైఖరి ప్రదర్శిస్తోన్న భారత్‌ను చూసి అమెరికా ఓర్వలేక విష ప్రచారం మొదలుపెట్టింది.

యుద్ధంలో ఇప్పటివరకు ఏ దేశానికి మద్దతు ఇవ్వని భారత్‌పై అగ్రరాజ్యం బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొంటే ఆంక్షలు ఉల్లంఘన కాదు.. కానీ యుద్ధానికి దిగిన రష్యా వైపు మొగ్గు చూపడాన్ని మాత్రం తాము ఎంతమాత్రం సమర్థించట్లేదని అమెరికా పరోక్ష విమర్శలు చేసింది. యుద్ధం వైపు మొగ్గు చూపడం అనేది చరిత్ర పుస్తకాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందంటూ అర్థంలేని ఆరోపణ చేసింది అమెరికా. రష్యా నాయకత్వానికి మద్దతు ఇస్తే.. రష్యా దురాక్రమణకు కూడా మద్దతు ఇచ్చినట్లే అంటూ వ్యాఖ్యానించింది. చరిత్ర పుస్తకాల్లో ఇండియా ఎక్కడ ఉండాలో ఆలోచించుకోవాలంటూ విమర్శించింది.

Russia Offered India : భారత్‌కు మరోసారి రష్యా బంపర్‌ ఆఫర్‌

రష్యా-యుక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా ముడిచమురు, పసిడి తదితర కమోడిటీల ధరలు మండుతున్నాయి. దీంతో ఇప్పటికే ద్రవ్యోల్బణ సెగతో సమస్యలు ఎదుర్కొంటున్న భారత్‌ సహా పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. యుక్రెయిన్‌ సరిహద్దులో రష్యా సైనిక దళాలను మోహరించడం ప్రారంభించాక ఊపందుకున్న ముడిచమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా నిలకడగా పెరుగుతూ వచ్చాయి. దీంతో ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడిన భారత్‌పై ఒత్తిడి పెరిగింది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు లభ్యత బాగా తగ్గిపోయింది.

మరోవైపు రష్యా వద్ద కొనుగోళ్లు తగ్గడంతో భారీగా నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో మన మిత్రపక్షమైన రష్యా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్‌కు అతి తక్కువ ధరకే క్రూడాయిల్ విక్రయిస్తామని చెప్పింది. ఈ ప్రతిపాదనతో తమ దేశంలో క్రూడ్ ఆయిల్‌ను కొంత మేర అమ్ముకునే సౌలభ్యం రష్యాకు దొరుకుతుంది. ఇక భారత్‌కు ఈ ఆఫర్‌ ద్వారా చౌకగా క్రూడ్ ఆయిల్ లభిస్తుంది. అయితే ఇది అంత చిన్న విషయం కాదు. రష్యా డిస్కౌంట్ డీల్‌ను భారత్ ఓకే చేయడంతో మనకు ఎన్నో రెట్లు ప్రయోజనముంటుంది.

Flags on Russian Rockets: రాకెట్ పై ఇతర దేశాల జెండాలను తొలగించిన రష్యా: భారత్ జెండాకు మాత్రం గౌరవం

అటు క్రూడ్‌ సరఫరాకు సంబంధించి షిప్పింగ్‌ ఛార్జీలు, ఇన్సూరెన్స్‌ కూడా రష్యానే భరించనుంది. రష్యా ఇచ్చిన ఆఫర్‌ను ఓకే చేస్తే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించవచ్చు. ఇంతకంటే ఏ దేశానికైనా ఏం కావాలి..? అందుకే రష్యా డీల్‌ను భారత్‌ ఓకే చేసింది. ఇక ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ టెండర్ల ద్వారా రష్యా నుంచి 30లక్షల బ్యారెల్స్‌ యురల్‌ను కొనుగోలకు సిద్ధమైంది. యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత రష్యానుంచి భారత్‌ ఆయిల్‌ను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి.

రష్యా-భారత్‌ డిస్కౌంట్ క్రూడాయిల్ డీల్‌లో అమెరికాకు వచ్చిన ఇబ్బందేంటో అర్థంకావడం లేదు. తమ సొంత ప్రయోజనాల కోసం మొన్న అఫ్ఘానిస్తాన్‌.. ఇప్పుడు యుక్రెయిన్‌ను బలిచేసిన అమెరికా.. భారత్‌ లాంటి దేశాలకు నీతులు చెప్పడం విడ్డురంగా అనిపిస్తోంది. ప్రపంచంలో దాదాపు సగం కంటే ఎక్కువ దేశాల్లో మిలటరీ బేస్‌లు కలిగిన అమెరికా ప్రపంచ శాంతి గురించి నీతులు చెప్పడం వింతగా అనిపించకమానదు..! ప్రపంచంపై ఆధిపత్యం కోసం.. తమ సొంత లాభాల కోసం.. నిత్యం సిరియా, ఇరాక్‌లలో మారణహోమానికి పాల్పడిన అమెరికా.. ఇప్పుడు శాంతికాముక దేశంగా తనకు తాను అభివర్ణించుకోవడం కంటే దారుణమైన విషయం మరొకటి లేదు.

India And Russia : భారత్ కు రష్యా అధ్యక్షుడు, కీలక ఒప్పందాలపై సంతకాలు!

అయినా యుద్ధంలో భారత్‌ ఇప్పటివరకు రష్యాకు మద్దతు తెలపలేదు. మరి ఇండియా యుద్ధాన్ని ఎలా ప్రేరేపిస్తున్నట్లు..? చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇప్పటికే అనేకసార్లు ఇరుదేశాలను భారత్‌ కోరింది. దౌత్య మార్గాల ద్వారా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని అటు రష్యా, ఇటు యుక్రెయిన్‌లకు ఇప్పటికే చాలాసార్లు సూచించింది కూడా. ఈ విషయంపై మోదీ ఇప్పటికే యుక్రెయిన్‌, రష్యా అధ్యక్షులతో మాట్లాడారు కూడా. ఇటు ఐక్యరాజ్యసమితిలో కూడా భారత్‌ ఇదే విషయాన్ని పదేపదే చెప్పింది. అయినా అమెరికా భారత్‌పై విషంచిమ్మడం అగ్రరాజ్య సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం కాక ఇంకేమవుతుంది…