Russia Offered India : భారత్‌కు మరోసారి రష్యా బంపర్‌ ఆఫర్‌

రష్యా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే చమురు, ఇతర పెట్రోలియం ప్రొడక్టుల విలువ ఒక బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్టు రష్యా ఒక స్టేట్‌మెంట్‌ విడుదల చేసింది.

Russia Offered India : భారత్‌కు మరోసారి రష్యా బంపర్‌ ఆఫర్‌

Russia India

Russia bumper offered India : రష్యా మరోసారి భారత్‌కు బంపరాఫర్‌ ఇచ్చింది.. అతి తక్కువ ధరకే భారత్‌కు క్రూడాయిల్‌ విక్రయిస్తామని మరోసారి చెప్పింది. ఈసారి ఏకంగా రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్‌ నొవాక్‌.. నేరుగా కేంద్రంతో మాట్లాడారు. కేంద్రమంత్రి హర్దిప్ పూరికి ఫోన్‌ చేసిన నోవాక్‌ ఈ విషయాన్ని చెప్పారు.. అంతేగాకుండా తమ పెట్రోలియం ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టాలని మరో రిక్వెస్ట్ కూడా చేశారు.

యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై గుర్రుగా ఉన్నా అమెరికా, ఇతర నాటో దేశాలు చమురుపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాయి. దీంతో గడచిన రెండు వారాల్లో రష్యా చమురును కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. అదే సమయంలో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిషేధం పుణ్యమా అని బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 139 డాలర్లకు చేరింది. దీంతో పాటు రష్యా వద్ద చమురు నిల్వలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.

Russia offers oxygen, Remdesivir కరోనా వేళ.. కష్టంలో తోడుగా.. భారత్‌కు రష్యా సాయం

రష్యా అమెరికాకు ప్రతి రోజు 7 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసేది. అంతేగాకుండా ప్రపంచ చమురు అవసరాల్లో 12 శాతం.. సహజ వాయువులో 16 శాతం అవసరాలను రష్యా తీరుస్తుంది. ఇప్పుడీ చమురును కొనేవారు లేకపోవడంతో.. ఆ చమురును భారత్‌కు అతి తక్కువ ధరకే విక్రయిస్తామంటూ రష్యా చమురు కంపెనీలు ఇప్పటికే భారత్‌కు ఆఫర్ చేశాయి. ఇప్పుడు మరోసారి నేరుగా నొవాక్‌ ఫోన్‌ చేయడంతో ఈ విషయంలో రష్యా చాలా సీరియస్‌గా ఉన్నట్టు క్లియర్‌ కట్‌గా తెలుస్తోంది.

రష్యా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే చమురు, ఇతర పెట్రోలియం ప్రొడక్టుల విలువ ఒక బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్టు రష్యా ఒక స్టేట్‌మెంట్‌ విడుదల చేసింది. అయితే దీనిని మరింత పెంచేందుకు రష్యా సుముఖంగా ఉంది. అదే సమయంలో ప్రస్తుతం కొనసాగుతున్న చమురు ఒప్పందాల అమలులో ఎలాంటి అవాంతరాలు.. అడ్డంకులు లేవని ప్రకటించింది రష్యా.

Flags on Russian Rockets: రాకెట్ పై ఇతర దేశాల జెండాలను తొలగించిన రష్యా: భారత్ జెండాకు మాత్రం గౌరవం

అయితే రష్యా ఇచ్చిన ఆఫర్‌పై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యా ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చిన విషయం వాస్తవమేనని.. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఒకవేళ చమురును దిగుమతి చేసుకోవాలని నిర్ణయిస్తే.. దానికి గల మార్గాలేంటి, చెల్లింపులు ఎలా చేయాలి.. షిప్‌మెంట్‌కు ఎంత ఖర్చవుతుందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అమెరికా, యూరోపియన్‌ దేశాలకు వ్యతిరేకంగా అడుగులు వేసినట్టే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం భారత్‌ తీసుకుంటుందా? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు భారత్‌ రష్యాకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమైతే తీసుకోలేదు.