US Drones: యుక్రెయిన్ కోసం అమెరికా నుంచి డ్రోన్ ఆయుధాలు

రష్యా బలగాలను అడ్డుకునేందుకు యుక్రెయిన్ కు అమెరికా ఆయుధాలను పంపిస్తున్న సంగతి తెలిసిందే. వీటలో 100 సాయుధ డ్రోన్‌లను చేర్చారు. AeroVironment Inc తయారుచేసిన డైవ్-బాంబిగ్..

US Drones: యుక్రెయిన్ కోసం అమెరికా నుంచి డ్రోన్ ఆయుధాలు

Us Drones

US Drones: రష్యా బలగాలను అడ్డుకునేందుకు యుక్రెయిన్ కు అమెరికా ఆయుధాలను పంపిస్తున్న సంగతి తెలిసిందే. వీటలో 100 సాయుధ డ్రోన్‌లను చేర్చారు. AeroVironment Inc తయారుచేసిన డైవ్-బాంబిగ్ స్విచ్ బ్లేడ్ డ్రోన్‌లను అఫ్ఘానిస్తనా్ లో సీక్రెట్ అటాక్ చేయడం కోసం ఉపయోగించారు. దీనిని ఫ్లయింగ్ షాట్‌గన్‌గా అభివర్ణిస్తుంటారు ఆర్మీ అధికారులు.

24అంగుళాలు (61 సెంటీమీటర్లు) కంటే తక్కువ పొడవు, 2.7 కిలోల బరువు ఉంటాయి.

ఈ డ్రోన్ లు సరైన పంచ్ ప్యాక్ తో దాడి చేయగలవని యూఎస్ డిఫెన్స్ సీనియర్ అఫీషియల్ చెప్పుకొచ్చారు. ఇది ఒక రక్‌సాక్‌లోనూ ఇమిడిపోగలదు. దీని ధర 6వేల డాలర్లు మాత్రమే.

యుక్రెయిన్ కోసం మంజూరు చేసిన ఆయుధాల ప్యాకేజీలో భాగంగా అధ్యక్షుడు జో బిడెన్ డ్రోన్‌ల గురించి వివరించకుండానే పంపేందుకు రెడీ అయిపోయాడు. “మా అత్యంత అత్యాధునిక వ్యవస్థలను యుక్రెయిన్‌ రక్షణ కోసం పంపించే నిబద్ధతతో ఉన్నామని” బైడెన్ అన్నారు.

Read Also: అరాచకానికి అడ్డాగా యుక్రెయిన్