King Charles : తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం .. కింగ్ చార్లెస్ పాలనపై సర్వత్రా ఆసక్తి..
తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం తరువాత ఆమెకుమారుడు చార్లెస్ రాజు అయ్యారు. మరి కింగ్ చార్లెస్ పాలన ఎలా ఉంటుంది?అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు బ్రిటన్ అంతా ఇదే చర్చ. రిటైరయ్యే వయసులో ఆయన పదవి చేపట్టినప్పటికీ ఆయన హయాం ఎలా ఉంటుందన్నది ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది.

Queen's Elizabeth death..King Charles
Queen Elizabeth..King Charles : తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం తరువాత ఆమెకుమారుడు చార్లెస్ రాజు అయ్యారు. మరి కింగ్ చార్లెస్ పాలన ఎలా ఉంటుంది?అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు బ్రిటన్ అంతా ఇదే చర్చ. రిటైరయ్యే వయసులో ఆయన పదవి చేపట్టినప్పటికీ ఆయన హయాం ఎలా ఉంటుందన్నది ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ప్రిన్స్ చార్లెస్….రాజుగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన ప్రపంచ ప్రజలకు తెలుసు. ఆ పదవి చేపట్టబోయేదీ ఆయనే అని తెలుసు. అయితే ఆయన పదవి చేపట్టింది…తల్లిలా అతి చిన్న వయసులో కాదు. వృద్ధాప్యంలో…రాజు కావడానికే నేను పుట్టానని తెలుసని చాలా ఏళ్ల క్రితం ఓ ఇంటర్యూలో చార్లెస్ చెప్పారు. అయితే చిన్నప్పటి నుంచి కాబోయే రాజు అనే హోదాలో పెరిగిన చార్లెస్‌కు ఆ పదవి చేపట్టడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది.
వివాదాల గతం నుంచి ఇప్పుడిప్పుడే ఓ నాయకుడిగా ప్రపంచం ఆయన్ను చూస్తోంది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్‌గా చార్లెస్, డయానా గడిపిన కాలం..ఆ తర్వాత చుట్టుముట్టిన వివాదాలు, డయానా మరణం, కెమిల్లాతో పునర్వివాహం వంటివన్నీ ప్రిన్స్ చార్లెస్‌పై నెగటివ్ అభిప్రాయం కలిగిస్తాయి కానీ…ఆయన..ప్రపంచానికి పరిచయం లేని మంచి అద్భుతమైన మనిషి అని సన్నిహితులు చెబుతారు. పర్యావరణ వేత్తగా గుర్తింపు పొందిన చార్లెస్..రాజుగా ఎలా ఉంటారన్నదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. తన ప్రమాణ స్వీకారాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయించుకున్నారు రాజు. బ్రిటన్ మాజీ ప్రధానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తొలి ప్రసంగంలో తల్లిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు రాజు. తన తల్లి 21 ఏళ్ల వయసులో చెప్పినట్టుగా జీవితమంతా దేశ సేవలోనే గడిపారని గుర్తుచేశారు. తాను కూడా ఆమె బాటలోనే పయనిస్తానన్నారు. కొత్త బాధ్యతతో తన జీవితంలో మార్పులొస్తాయని తెలుసన్నారు. సెయింట్ జార్జ్ ప్యాలెస్‌లోని ఫెర్రీ కోర్ట్ బాల్కనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. గాడ్ సేవ్ ది కింగ్ పేరుతో ప్రజలు కొత్త రాజుకు శుభాకాంక్షులు చెప్పారు. రాజుగా చార్లెస్ పట్టాభిషేకం ఎప్పుడు జరుగుతుందన్నదానిపై బకింగ్ హామ్ ప్యాలెస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రాణి అంత్యక్రియలు ముగిశాకే ఈ ప్రకటన రావొచ్చు. బ్రిటన్ రాజుగా ఎలా ఉండాలో తనకు తెలుసు ఎప్పుడూ చెబుతుంటారు చార్లెస్. సుదీర్ఘ ప్రజా జీవనంలో ఎదురయిన అనుభవాలను..ఇప్పుడు రాజుగా చేపట్టబయే సంస్కరణలకు ఉపయోగించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది
ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంపైనా విమర్శలు తొలగిపోయాయి. కెమిల్లాను ప్రజలు అంగీకరించారు. ఆమెకు రాణి హోదా దక్కింది. రాచరికాన్ని వద్దని వదలుకుని వెళ్లిన ప్రిన్స్ హ్పయారీ, మేఘన్‌తో చార్లెస్ సంబంధాలు ఎలా ఉంటాయన్న విషయాన్నీ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. వారిద్దరిపైనా తనకు ప్రేమ ఉందని ఆయన రాజుగా చేసిన తొలి ప్రసంగంలో చెప్పారు. చార్లెస్ రాజయ్యాక, ఆయన పాత పదవి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విలియమ్స్‌కు దక్కింది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ హోదాలో విలియమ్స్ దంపతులు బయటకు కనిపించే సమయంలో..అన్నదమ్ముల మధ్య విభేదాలు తొలగించడానికి తండ్రిగా, రాజుగా తన వంతు పాత్ర చార్లెస్ పోషించినట్టు బ్రిటన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రాణి మరణంతో దేశమంతా విషాద వాతావరణం ఉన్న సమయంలో….రాచకుటుంబంలో విభేదాలు సమసిపోవాలని చార్లెస్ కోరినట్టు..అందుకు విలియమ్స్ అంగీకరించినట్టు తెలుస్తోంది. విండ్సర్ క్యాజల్ బయటకు ఇద్దరు అన్నదమ్ములు ఒకే కారులో వచ్చి 40 నిమిషాలు గడపడానికి ముందు 45 నిమిషాల పాటు చర్చలు జరిగినట్టు సమాచారం. మొత్తంగా చార్లెస్ రాజు అయిన సందర్భంగా ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్స్ హ్యారీ పాత విభేదాలు వీడి..చిన్నప్పటి మమతానురాగాలతో ముందుకు సాగాలని బ్రిటన్ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.