Artificial intelligence : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు…ఐఎంఎఫ్ చీఫ్ వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ వెల్లడించారు....

IMF MD Kristalina Georgieva
Artificial intelligence : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ వెల్లడించారు. అధునాతన ఆర్థిక వ్యవస్థలలో 60 శాతం ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లోని వార్షిక ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌కు బయలుదేరడానికి ముందు వాషింగ్టన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు.
ALSO READ : Gold Rate Today : బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏఐ తక్కువ ప్రభావం చూపుతుందని అంచనా వేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆమె ఐఎంఎఫ్ నివేదికను ఉటంకిస్తూ చెప్పారు. ఏఐ కారణంగా మెరుగైన ఉత్పాదకత లాభాలతో ప్రయోజనం పొందవచ్చునని ఆమె చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏఐకి సంబంధిత ఉత్పాదకత బూస్ట్‌ను ఉపయోగించగలదన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విధానానికి 2024 కఠినమైన సంవత్సరంగా ఉండే అవకాశం ఉందని జార్జివా చెప్పారు. పలు దేశాలు కొవిడ్ -19 మహమ్మారి సమయంలో పేరుకుపోయిన రుణ భారాలను పరిష్కరించడానికి యత్నిస్తున్నాయన్నారు.