అయ్య బాబోయ్.. అంగారక గ్రహంపై ఏలియన్ అవశేషాలు? నాసా ఏం గుర్తించిందంటే..?

దాన్ని రోవర్ ఏప్రిల్‌ 11న గుర్తించింది.

అయ్య బాబోయ్.. అంగారక గ్రహంపై ఏలియన్ అవశేషాలు? నాసా ఏం గుర్తించిందంటే..?

Updated On : April 20, 2025 / 10:20 PM IST

అంగారక గ్రహంపై ఏలియన్ అవశేషాలు ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాసా పెర్సెవెరన్స్‌ రోవర్ తాజాగా కపాలంలా ఉన్న  ఓ రాయిని మార్స్‌పై గుర్తించింది.

పెర్సెవెరన్స్‌ రోవర్‌ను నాసా మార్స్ 2020 మిషన్‌లో భాగంగా మార్స్‌పై జెజెరో క్రేటర్‌ను అన్వేషించడానికి ఆ గ్రహంపైకి పంపింది. ఈ రోవర్ కారు సైజులో ఉంటుంది. అది మార్స్‌పై తిరుగుతూ పరిశోధనలు చేస్తోంది.

ఆ రోవర్‌ కపాలంలా ఉన్న  ఓ రాయిని గుర్తించడంతో అది ఏలియన్స్‌కు చెందిన అవశేషమని వాదనలు వినపడుతున్నాయి. దాన్ని రోవర్ ఏప్రిల్‌ 11న గుర్తించింది.

Also Read: బైక్‌ కొందామనుకుంటున్నారా? తక్కువ ధరకు వచ్చే ఈ రెండు బైకుల్లో ఏది బెస్ట్?

మార్స్‌పై జెజెరో క్రేటర్‌లోని విచ్ హాజెల్ హిల్ వద్ద రోవర్ తిరుగుతున్న సమయంలోనే ఆ రాయిని గుర్తించింది. ఆ రాయిని ఇప్పుడు “స్కల్‌ హిల్‌” అని పిలుస్తున్నారు. మార్స్‌పై జెజెరో క్రేటర్‌ ప్రాంతం 28 మైళ్ల వెడల్పుతో ఉంటుంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇది సరస్సు అని, వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ ప్రాంతం పొడిగా, మురికిగా మారిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

“స్కల్‌ హిల్‌” పూర్తిగా రాయిలా లేదు. దాని చుట్టూ ఉన్న వాటికి భిన్నంగా ఉంది. “స్కల్‌ హిల్‌” రంగు డార్క్‌గా ఉంది. దానిపై చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి.

మొదట ఈ “స్కల్‌ హిల్‌”ను శాస్త్రవేత్తలు ఉల్కగా భావించారు. కానీ, రోవర్‌ సూపర్‌ కెమెరా ద్వారా కెమికల్‌ అనాలిసిస్ చేసి చూస్తే అది ఉల్క కాదని స్పష్టమైంది. ఈ “స్కల్‌ హిల్‌” అక్కడకు ఎలా వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవడానికి మరిన్ని పరీక్షలు చేయనున్నారు.