బైక్ కొందామనుకుంటున్నారా? తక్కువ ధరకు వచ్చే ఈ రెండు బైకుల్లో ఏది బెస్ట్?
స్పెసిఫికేషన్లను పోల్చి చూసి మీకు నచ్చి బైకును కొనుక్కోవచ్చు.

హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ ప్లాటినా 100 బైక్‌లను చాలా మంది ఇష్టపడతారు. చాలా సౌకర్యవంతంగా ఉండడంతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ కావడంతో వీటిని కొంటుంటారు. ఈ రెండు బైకుల్లో మీకు ఏది బాగుంటుందా? అని ఆలోచిస్తున్నారా? వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్లను పోల్చి చూసి మీకు నచ్చి బైకును కొనుక్కోవచ్చు.
హీరో స్ప్లెండర్ ప్లస్ స్పెసిఫికేషన్లు
- డిస్‌ప్లేస్‌మెంట్: 97.2 cc
- ఇంజిన్: ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, OHC
- మ్యాగ్జిమం పవర్: 8000 rpm వద్ద 7.7 HP
- పీక్ టార్క్: 6000 rpm వద్ద 8.05 Nm
- గేర్‌బాక్స్: 4-స్పీడ్ కాన్‌స్టంట్ మెష్
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం: 9.8 లీటర్
- వీల్‌బేస్: 1236 mm
- గ్రౌండ్ క్లియరెన్స్: 165 mm
- బరువు: 112 కిలోలు
- ఫ్రంట్ సస్పెన్షన్: టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు
- రియర్ సస్పెన్షన్: 5-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లతో స్వింగార్మ్
Also Read: రూ.25 వేలలోపే ధర.. కేక పెట్టించే ఫీచర్లతో వచ్చిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది కొంటారు?
బజాజ్ ప్లాటినా 100 స్పెసిఫికేషన్లు
- డిస్‌ప్లేస్‌మెంట్: 102 cc
- ఇంజిన్: 4-స్ట్రోక్, DTS-i, సింగిల్ సిలిండర్
- మ్యాగ్జిమం పవర్: 7500 rpm వద్ద 7.7 HP
- పీక్ టార్క్: 5500 rpm వద్ద 8.3 Nm
- గేర్‌బాక్స్: 4-స్పీడ్ (ఆల్ డౌన్ షిఫ్ట్)
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం: 11 లీటర్లు
- వీల్ బేస్: 1255 mm
- గ్రౌండ్ క్లియరెన్స్: 200 mm
- బరువు: 117 కిలోలు
- ఫ్రంట్ సస్పెన్షన్: 135 mm, హైడ్రాలిక్ టెలిస్కోపిక్ రకం
- రియర్ సస్పెన్షన్: 110 mm, స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ సస్పెన్షన్
హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ ప్లాటినా 100 ధరలు
- హీరో స్ప్లెండర్ ప్లస్ ధర: వేరియంట్ ఆధారంగా రూ. 77,176 నుంచి రూ. 80,176 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది
- బజాజ్ ప్లాటినా 100 ధర: ప్రారంభ ధర రూ. 68,890 (ఎక్స్-షోరూమ్)