రూ.25 వేలలోపే ధర.. కేక పెట్టించే ఫీచర్లతో వచ్చిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది కొంటారు?
దీంతో ఆ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఈ రెండు ఫోన్లు మంచి ఆప్షన్‌గా మారాయి.

Motorola Edge 60 Fusion vs Nothing Phone 3a
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో అధికారికంగా ఏప్రిల్ 2న లాంచ్ అయింది. అలాగే, నథింగ్ ఫోన్ 3aను భారత్‌లో అధికారికంగా మార్చి 4 లాంచ్ చేసి, మార్చి 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తున్నారు.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, నథింగ్ ఫోన్ 3a రెండింటి ధరలు రూ.25 వేలలోపే ఉన్నాయి. దీంతో ఆ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఈ రెండు ఫోన్లు మంచి ఆప్షన్‌గా మారాయి. ఈ రెండింటిలో ఏ ఫోన్ కొనాలా అని అనుకుంటున్నారా? వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుని మీకు ఏయే ఫీచర్లు నచ్చుతాయో చూసి, అవి ఉన్న ఫోన్‌ను కొనండి..
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారి ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉంటాయి. కొందరు స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మన్స్ బాగుండాలని అనుకుంటారు. మరికొందరు మంచి కెమెరాలు ఉండాలని భావిస్తారు.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, నథింగ్ ఫోన్ 3a రెండు ఫోన్లూ క్లీన్ UISతో రన్ అవుతాయి. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ యూఐ స్మూత్‌గా, మినిమలిస్టిక్, స్టాక్ ఆండ్రాయిడ్ లాగా అనిపిస్తుంది. మరోవైపు, నథింగ్ ఫోన్ 3a ఓఎస్ కస్టమైజేషన్ ఆప్షన్లు, సిగ్నేచర్ గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో యూజర్లను ఆకర్షిస్తోంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫీచర్లు
డిస్ప్లే: 1220p రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ పోల్డ్
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7400
ర్యామ్, స్టోరేజ్: 8GB, 12GB RAM; 256GB, 512GB స్టోరేజ్
కెమెరాలు: సోనీ LYT700C సెన్సార్‌తో 50MP బ్యాక్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5,500mAh, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో
డ్యురబిలిటీ: IP69 రేటింగ్, MIL-STD 810H సర్టిఫికేషన్
ఆపరేటింగ్ సిస్టమ్: Moto AI ఫీచర్లతో Android 15
ధర 8GB RAM + 256GB స్టోరేజ్: రూ.22,999
12GB RAM + 256GB స్టోరేజ్: రూ.24,999
నథింగ్ ఫోన్ 3a ఫీచర్లు
డిస్ప్లే: 6.77-అంగుళాల LTPO AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3
బ్యాక్ కెమెరాలు: ట్రిపుల్ సెటప్ – 50MP వెడల్పు, 50MP టెలిఫోటో (2x ఆప్టికల్ జూమ్), 8MP అల్ట్రావైడ్
ముందు కెమెరా: 32MP
బ్యాటరీ: 5,000mAh, 50W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో
ఆపరేటింగ్ సిస్టమ్: నథింగ్ OS 3.1తో Android 15
ధర: 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.24,999