భూమిపైకి దూసుకొస్తున్న ఏలియన్స్..? నవంబర్‌లో గ్రహాంతర అంతరిక్ష నౌక భూమిపై దాడి చేయబోతుందా.. శాస్త్రవేత్తల కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు..
ఏలియన్స్ భూమిపైకి దూసుకొస్తున్నాయా..? అత్యంత వేగంతో వస్తున్న గ్రహాంతర అంతరిక్ష నౌక భూమిని ఢీకొట్టబోతుందా.. అంటే అవుననే చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Alien Spacecraft: ఏలియన్స్ భూమిపైకి దూసుకొస్తున్నాయా..? అత్యంత వేగంతో వస్తున్న గ్రహాంతర అంతరిక్ష నౌక భూమిని ఢీకొట్టబోతుందా.. అంటే అవుననే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కొంత మంది శాస్త్రవేత్తలు దీన్ని సౌర వ్యవస్థ వెలుపల నుంచి వచ్చిన సాధారణ తోకచుక్కగా చెబుతున్నా.. మరికొందరు నిపుణులు దీన్ని గ్రహాంతర నాగరికతల చేత తయారు చేయబడిన నిఘా పరికరం (గ్రహాంతర అంతరిక్ష నౌక) అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నవంబర్ నెలలో ఈ గ్రహాంతర అంతరిక్ష నౌక భూమిపై దాడి చేస్తుందని శాస్త్రవేత్తలు కొత్త అధ్యయనంలో ఈ వాదన చేశారు.
ఇటీవలి అధ్యయనం ప్రకారం.. మాన్‌హట్టన్ పరిమాణంలో ఉన్న ఒక మర్మమైన వస్తువు ఈ ఏడాది నవంబర్ నెలలో భూమిపై దాడి చేయబోయే గ్రహాంతర అంతరిక్ష నౌక అని నివేదించబడిందని డైలీ స్టార్ నివేదించింది. ఈనెల ప్రారంభంలో శాస్త్రవేత్తలు అరుదైన ఇంటర్స్టెల్లార్ వస్తువును చూసినట్లు నిర్ధారించారు. మన సౌర వ్యవస్థ గుండా అధిక వేగంతో వెళ్తున్న ఈ రకమైన వస్తువు ఇప్పటివరకు చూసిన వాటిలో మూడోది. జూలై 22న ప్రచురించిన ఒక శాస్త్రీయ పత్రం ప్రకారం.. 3I/ATLAS అని పిలువబడే ఈ వస్తువు గ్రహాంతర సాంకేతికత కావచ్చు, అకస్మాత్తుగా మన గ్రహం మీద దాడి చేయగలదనే వాదనను వెలుబుచ్చారు.
3I/ATLAS వస్తువు గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హార్వర్డ్ విశ్వవిద్యాలయపు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అవి లోబ్ దీన్ని సాధారణ వస్తువు కాదు.. ఒక గ్రహాంతర సాంకేతికతతో తయారు చేయబడిన నిఘా పరికరం అని భావిస్తున్నారు. పరిశోధనా పత్రాన్ని రాసిన వారిలో అవీ లోబ్ ఒకరు. లండన్‌కు చెందిన ఇనిషియేటివ్ ఫర్ ఇంటర్ట్సెల్లార్ స్టడీస్ కు చెందిన శాస్త్రవేత్తలు ఆడమ్ హిబ్బార్డ్, ఆడమ్ క్రోల్ కూడా ఉన్నారు. అయితే, వారిద్దరూ పరిశోధన పూర్తిగా ఊహాజనితమైందని స్పష్టం చేశారు. పరిశోధన గుర్తించదగినది అయినప్పటికీ.. దాని పరికల్పనలను పరీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే, నిజంగానే అది గ్రహాంతర అంతరిక్ష నౌక అని నిరూపిస్తే.. మానవాళికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా వారు హెచ్చరించారు.
ఈ వస్తువు గుర్తించే వీలులేకుండా ప్రకాశిస్తూ భూమిని సులభంగా చేరుకోగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే నవంబర్ నెలలో సూర్యుడికి దగ్గరగా చేరుకున్నప్పుడు అది భూమి దృష్టి నుంచి అదృశ్యమవుతుందని, తద్వారా దాని వేగాన్ని తగ్గించడానికి, సౌర వ్యవస్థలో ఉండటానికి, రహస్య దాడికి సిద్ధమవుతుందని చెబుతున్నారు.
కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. 3I/ATLAS గ్రహాంతరవాసులకు సంకేతం కాదని సూచించే బలమైన ఆధారాలు ఉన్నాయని ఎత్తి చూపారని ది న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.