హఫీజ్ నెలకు లక్షా 50వేలు విత్ డ్రా చేసుకోవచ్చు

  • Published By: venkaiahnaidu ,Published On : September 26, 2019 / 11:12 AM IST
హఫీజ్ నెలకు లక్షా 50వేలు విత్ డ్రా చేసుకోవచ్చు

Updated On : September 26, 2019 / 11:12 AM IST

26/11ముంబై ఉగ్రదాడి సూత్రధారి,భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన గ్లోబల్ టెర్రరిస్ట్,జమాద్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ స‌యీద్‌ తన బ్యంకు అకౌంట్ల నుంచి ఖర్చుల కోసం డబ్బలు తీసుకునేందుకు అతడిని అనుమతించాలంటూ ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లికి పాకిస్తాన్ లేఖ రాసింది. న‌లుగురు స‌భ్యులున్న కుటుంబానికి హ‌ఫీజే ఆధార‌మ‌ని, వారి ఆహారం, దుస్తుల ఖ‌ర్చు మొత్తం అత‌నే చూసుకుంటాడ‌ని, స‌యీద్ కుటుంబానికి నెల‌వారి ఖ‌ర్చుల‌ను విడుద‌ల చేసేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ భ‌ద్ర‌తా మండ‌లిని పాక్ కోరింది.

ఆగ‌స్టు 15,2019న పాక్ రాసిన ఈ లేఖ‌పై ఎటువంటి అభ్యంత‌రాలు వ్య‌క్తం కాక‌పోవ‌డంతో పాక్ అభ్య‌ర్థ‌న‌కు ఆమోదం తెలిపిన‌ట్లు భ‌ద్ర‌తా మండ‌లి చెప్పింది. హఫీజ్ ప్ర‌స్తుతం నెల‌కు ల‌క్షా 50 వేల(పాక్ క‌రెన్సీ) రూపాయాల‌ను విత్‌ డ్రా చేసుకునే సౌల‌భ్యాన్ని క‌ల్పించారు. 

గ‌తంలో భ‌ద్రతా మండ‌లి ఆదేశాల మేరుకు హ‌ఫీజ్ బ్యాంక్ అకౌంట్‌ను పాక్ సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉగ్ర‌వాదంపై కఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు చెబుతున్న పాక్…ఇప్పుడు స‌యీద్‌కు క‌ల్పించిన వెస‌లుబాటుతో తన నిజస్వరూపాన్ని మరోసారి ప్ర‌ద‌ర్శించింది.