Mona Lisa : మోనాలిసా ఎవరు? వందల సంవత్సరాలుగా వెంటాడుతున్న ప్రశ్నకు సమాధానం దొరికిందా?
మోనాలిసా.. చిత్రంలో నవ్వుని చూసి ఫిదా అయిపోతారు. ఇళ్లలో పెట్టుకుని ఆరాధిస్తారు. సినిమా పాటల్లో పాడేసుకుంటారు. అసలు ఇంతకీ ఎవరు ఈ మోనాలిసా?

Mona Lisa
Mona Lisa : మోనాలిసా అంటే ఎవరు? అందమైన చిరునవ్వుతో కనిపించే స్త్రీ మూర్తి చిత్రం అంటారు. ఎందుకంటే చాలాచోట్ల మోనాలిసా చిత్రాన్ని చూస్తూ ఉంటాం. ఆమె చిత్రాన్ని చూసినప్పుడు చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఒక్కోసారి నవ్వుతున్నట్లు.. ఒక్కోసారి విషాదంగా.. అసలు ఎవరు ఈ మోనాలిసా? వందల ఏళ్లుగా పరిశోధకులకు సమాధానం దొరకని ప్రశ్నగానే ఉంది.
Kerala: తన వీపుపై పీఎఫ్ఐ ముద్రవేసిందంటూ సంచలనం రేపిన జవాన్ అరెస్ట్.. అసలు విషయం ఏంటంటే?
మోనాలిసా చిత్రం గీసింది ఇటలీ శాస్త్రవేత్త లియోనార్డో డావెన్సీ. ఆ చిత్రంలో ఉన్న ఒరిజినల్ మోనాలిసా ఎవరు? కొన్ని శతాబ్దాలుగా పరిశోధకులకు అంతుచిక్కని ప్రశ్న. లియోనార్డో ఊహించి వేసారా? నిజంగానే ఆమె అప్పట్లో కనిపించిన స్త్రీనా? కొందరు పరిశోధకులు డావెన్సీ తనను స్త్రీగా ఊహించుకుని గీసుకున్న చిత్రం అని కూడా నమ్మారట. కానీ వాస్తవం తెలియలేదు.
మోనాలిసా అసలు పేరు లిసా డెల్ జియోకొండో అట. ఇటలీ ఫ్లోరెన్స్‌కి చెందిన పట్టు వస్త్రాల వ్యాపారి గెరార్డిని ఆమె పెళ్లాడిందట. అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలని.. ఆమె రెండవ కుమారుడు జన్మించిన సందర్భంలో కొత్త ఇంటి కోసం ఆమె పెయింటింగ్‌ను రూపొందించారని చరిత్ర కారులు చెబుతారు. కానీ దీనికి కూడా సరైన ఆధారం లేదు.
Amazing artist : రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికుడికి తెలియకుండా చిత్రాన్ని గీసిన ఆర్టిస్ట్.. ఆ తరువాత
మోనాలిసా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన చిత్రం. 1503-1506 మధ్య డా విన్సీ దీనిని చిత్రించారని చెబుతారు. ఇది పోప్లర్ ప్యానెల్‌పై వేసిన ఆయిల్ పెయింటింగ్. ఈ పెయింటింగ్ కోసం దాడులు కూడా జరిగాయట. ఫ్రాన్స్ రాజు ఫ్రాన్సిస్ ఈ పెయింట్‌ను స్వాధీనం చేసుకుని పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో శాశ్వత ప్రదర్శనలో ఉంచారు. 1950 చివరలో కొన్ని విధ్వంసాల వల్ల పెయింటింగ్ కొంచెం దెబ్బతిందట. అందుకే ప్రస్తుతం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమె పెయింటింగ్‌ను ఉంచారు. మోనాలిసా పెదవులపై చిరునవ్వు చూడటానికి ఏటా లక్షలాది మంది సందర్శకులు పారిస్‌కి వస్తుంటారు.
మోనాలిసాకు కనుబొమ్మలు ఎందుకు లేవనేది చాలామందికి అనుమానం ఉంటుంది. పాస్కల్ కాట్ అనే ఇంజనీర్ ఈ రహస్యాన్ని ఛేదించారు. డా విన్సీ చిత్రించిన చిత్రంలో మోనాలిసాకి కనుబొమ్మలు ఉన్నాయి. చిత్రాన్ని శుభ్రం చేస్తూ ఉండటంతో కాలక్రమేణ అవి కనిపించకుండా పోయాయట. మోనాలిసా కంటిని నిశితంగా గమనిస్తే కంటి చుట్టూ ఉన్న పగుళ్లు కొద్దిగా మాయమైనట్లు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Pune : ఈ ఆర్టిస్ట్ టాలెంట్ చూడండి.. పూలు అమ్ముతున్న పెద్దావిడ చిత్రాన్ని ఎంత బాగా గీసాడో..
మోనాలిసా చిత్రం ఎంత విలువైనదో తెలుసా? పెయింటింగ్‌కు డాలర్ ఫిగర్ కనుక జత చేసి వేలం వేస్తే దాని ఖరీదు $700 మిలియన్లకు (ఇండియన్ కరెన్సీలో 57,94,60,00,000) పైగా ధర వస్తుందట. అంత విలువైనదన్నమాట. మోనాలిసా అసలు ఎవరు? ఎక్కడ ఉండేది? వంటి ఖచ్చితమైన ఆధారాలు దొరకకపోయినా సినిమా పాటల్లో ఆమె పేరు వినబడుతుంది. చాలామంది ఇళ్లలో ఆమె పెయింట్ కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది మనసుల్లో మోనాలిసా ఆరాధ్యనీయురాలైంది.