క్యా కరోనా : amazon హోమ్ డెలివరీ సేవలు బంద్

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఆర్థిక రంగం కుదేలవుతోంది. అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. బయటకు వెళ్లి…నిత్యావసరకులకు కూడా పోవడం లేదు. ఎంచక్కా..ఇంట్లో నుంచే ఒక్క క్లిక్‌తో వస్తువులు తెచ్చుకుంటున్నారు. చాలా మంది ఈ కామర్స్ సంస్థలను నమ్ముకున్నారు. ఇందులో అమెజాన్ దిగ్గజం. ఆర్డర్‌ని బట్టి నిత్యావసర సరకులు, ఇతరత్రా వస్తువులను నేరుగా ఇంటికే సరఫరా చేస్తోంది. కానీ..ఇక హోం డెలివరీ చేయమని అమెజాన్ సంస్థ ప్రకటించింది. కరోనా వైరస్ మూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
See Also | కరోనా వైరస్.. గాలిలో గంటలు, ఉపరితలాలపై రోజుల పాటు బతికే ఉంటుంది
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాలో హోమ్ డెలివరీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 5 వరకు ఇది కొనసాగుతుందని వెల్లడించింది. అయితే.. వైద్య సంబంధిత వస్తువువులు, నిత్యావసరాలు, డిమాండ్ ఎక్కవగా ఉన్న వస్తువులను మాత్రం యథావిధిగా సరఫరా చేస్తామని వెల్లడించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి వినియోగదారులంతా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అమెరికాలో ఇప్పటి వరకు 5 వేల 636 కేసులు నమోదు కాగా..సుమారు వంద మంది దాక చనిపోయి ఉంటారని అంచనా.
మరోవైపు ఆన్ లైన్ కొనుగోళ్లు పెరుగుతుండడంతో కొత్త ఉద్యోగస్తులను రిక్రూట్ చేసుకొంటోంది అమెజాన్. గోదాములలో పనిచేయడానికి, సరుకులు డెలివరీ చేయడానికి ఉద్యోగస్తులను నియమిస్తామని ప్రకటించింది. యూకే, యూరప్, అమెరికాలలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు కూడా పెంచే యోచనలో ఉన్నట్టుంది. కరోనా వైరస్ కారణంగా చాలా సంస్థలు..ఇంటి నుంచే పనిచేసే సౌకర్యం కల్పించాయి.
Read More : కరోనా ఎఫెక్ట్ : whatsappలో పరీక్షా ఫలితాలు