Houston Club Firing
Gun Fire in US: అమెరికా (America) లో కాల్పుల మోత సర్వసాధారణంగా మారిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు (indiscriminate firing) జరపడం, స్థానిక పౌరులు మరణించడం నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా యూఎస్ నగరంలోని హ్యూస్టన్ (Houston) లోని టబు క్లబ్ (Tabu club) వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సెలవురోజు కావడంతో క్లబ్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.
America Shooting : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
కాల్పుల ఘటన అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మొత్తం ఆరుగురికి గాయాలుకాగా, వారిలో ఒకరి పరిస్థితి మిషంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. రద్దీగా ఉండే పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడని హ్యూస్టన్ పోలీస్ చీఫ్ ట్రాయ్ ఫైనర్ అన్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పాడు.
America Shooting : అమెరికాలో మరోసారి కాల్పులు.. 8 మంది మృతి
అమెరికాలో కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు గుంపుగాఉన్న ప్రదేశం వద్దకు వచ్చి కాల్పులు జరిపి అనేక మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం.. 2006 నుంచి ఇప్పటి వరకు అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనల్లో 2,793 మంది మరణించారు. కాగా 2022 సంవత్సరంలో 42 మరణాలు నమోదయ్యాయి.