Biden, Elon Musk : ఆశ్చర్యంగా అనిపించలేదన్న బైడెన్, కాస్త లేట్ అయ్యిందన్న మస్క్.. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతిపై కామెంట్లు

వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మృతి వార్త తనకు ఆశ్చర్యం కలిగించలేదని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. అలాగే ప్రిగోజిన్ మరణం తాను అనుకున్నదాని కంటే కాస్త లేట్ అయ్యిదంటు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.అంటే ప్రిగోజిన్ మరణం తప్పదని ముందే ఊహించారా..? పుతిన్ తో పెట్టుకుంటే అంతేనా..?

Biden, Elon Musk : ఆశ్చర్యంగా అనిపించలేదన్న బైడెన్, కాస్త లేట్ అయ్యిందన్న మస్క్.. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతిపై కామెంట్లు

Joe Biden, Elon Musk comments on Wagner chief Yevgeny Prigozhin

Biden- Yevgeny Prigozhin : రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ (Wagner chief Yevgeny Prigozhin)తో పాటు మరో 9 మంది మరణించారు. రష్యాలోని అత్యంత శక్తివంతమైన కిరాయి సైనికుడు యెవ్జెనీ ప్రిగోజిన్ బుధవారం సాయంత్రం మాస్కోకు ఉత్తరాన కుప్పకూలిన విమానంలో మరణించాడు. ఈ విషయాన్ని రష్యా అధికారులు దృవీకరించారు. ప్రిగోజిన్ ఆర్మీ ఉన్నతాధికారులపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన రెండు నెలల తర్వాత ఈ ఘటన జరిగింది. ఉక్రెయిన్‌ దేశంతో రష్యా చేసిన యుద్ధం అసమర్థ నిర్ణయం అని ప్రిగోజిన్ వాదించాడు. ప్రిగోజిన్ సాయుధ తిరుగుబాటు చేయడం ద్వారా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహానికి గురయ్యారు.

పుతిన్ ఆగ్రహానికి గురైన ప్రిగోజిన్ కు త్వరలోనే మరణం తథ్యం అనే వార్తలు అప్పట్లో వచ్చాయి. ఈక్రమంలో ప్రిగోజిన్ మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ అధినేత, ప్రపంచ వార్తల్లో నిత్యం వైరల్ గా ఉండే ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. మస్క్ డైరెక్టుగా స్పందించకుండా ఇన్ డైరెక్టుగా స్పందిస్తే .. బైడెన్ మాత్రం డెరెక్టుగానే ప్రిగోజిన్ మరణం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు అంటూ వ్యాఖ్యానించారు. ప్రిగోజిన్ మరణం ఎలా సంభవించిందో గానీ అతని మరణం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు అంటూ పేర్కొన్నారు. ప్రిగోజిన్ మరణం అంతా ఊహించిందేనని తెలిపారు.

ఇక మస్క్ మాత్రం అతని మరణం ఊహించినదానికన్నా కాస్త ఆలస్యమైంది అంటూ పేర్కొన్నారు.వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ పేరు ప్రస్తావించకుండానే ఆయన మరణాన్ని తాను ముందే ఊహించాననీ, అయితే కొంత ఆలస్యం జరిగిందంటూ ట్వీట్ చేశారు. పుతిన్ పై తిరుగుబాటు ప్రకటించిన తర్వాత ప్రిగోజిన్ కు మరణం తప్పదని ఊహించినట్లు మస్క్ తెలిపారు. విమాన ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగేందుకు స్వల్ప అవకాశాలు లేకపోలేదని తన ట్వీట్ లో మస్క్ పేర్కొన్నారు. ప్రిగోజిన్ మరణం తాను ఊహించినదాని కంటే కాస్త సమయం పట్టింది అంటూ పేర్కొన్నారు.

Yevgeny Prigozhin : పుతిన్ ను వణికించిన వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మృతి

రష్యాలో జరిగిన ఈ విమాన ప్రమాదంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా మారడమే ప్రిగోజిన్ మరణానికి కారణమైందని భావిస్తున్నారు. కానీ బైడెన్ మాత్రం తాను ఊహించిందే జరిగిందన్నట్లుగా ప్రిగోజిన్ మరణం తనకేమి ఆశ్చర్యాన్ని కలిగించలేదంటూ కూల్ గా చెప్పారు.

కాగా యుక్రెయిన్ పై రష్యా సాగించిన యుద్ధంలో వాగ్నర్ గ్రూపు కూడా పాల్గొంది. ప్రిగోజిన్ స్వయంగా తన సేనను ముందుండి నడిపించారు. ఈ దళాల వల్లే యుక్రెయిన్ లో ఎక్కువగా ఆస్తి, ప్రాణా నష్టాలు జరిగినట్లుగా తెలుస్తోంది. కానీ తమకు సరిపోయినన్ని ఆయుధాలు ఇవ్వకుండా రష్యా ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నవారు వాగ్నర్ సైనికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రిగోజిన్ ఆరోపించారు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తిరుగుబాటు ప్రకటించారు.

అలా ప్రిగోజిన్- పుతిన్ లా మారింది. వీరిద్దరికి సయోధ్యను కురదర్చటంలో బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో కీలకంగా వ్యవహరించారు. పుతిన్, ప్రిగోజిన్ మధ్య సంధి కుదిర్చారు.ప్రిగోజిన్ ను మాస్కోకు ఆహ్వానించి పుతిన్ విందు కూడా ఇచ్చారు. దీంతో అంతా సర్దుకున్నట్లే అందరు భావించినా పుతిన్ గురించి తెలిసినవారు మాత్రం ఆయన ఫోకస్ ప్రిగోజిన్ పై ఉందని గుర్తించారు. తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోవడంతో అమెరికాతో పాటు పలు దేశాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. ఈ మరణం వెనుక పుతిన్ ఉన్నారనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. కాగా..సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని వాగ్నెర్ కార్యాలయాలు ఉన్న భవనం వద్ద ప్రిగోజిన్ మృతికి సంతాప సూచకంగా ఒక పెద్ద శిలువను ప్రదర్శించారు.