ఏప్రిల్ 30 వరకు సామాజిక దూరం పాటించండి

  • Publish Date - March 30, 2020 / 07:38 AM IST

రాగల రెండు వారాల్లో అమెరికా లో  కరోనా మరణాలు పెరిగే అవకాశం ఉందని దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.  ఈస్టర్ నాటికి దేశం సాధారణ పరిస్ధితికి చేరుకుంటుదని ఆశించానని…అయితే పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆవేదవ వెలిబుచ్చారు. 

ఇటువంటి పరిస్ధితుల్లో అమెరికా ప్రజలు ఏప్రిల్ 30 వరకు సోషల్ డిస్టెన్స్ మెయిన్టెయిన్ చేయాలని ఆదేశించారు. అమెరికాలో ఇప్పటి వరకు లాక్ డౌన్ విధించక పోయినా  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సామాజిక దూరం పాటించాలని …అనవసరంగా ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దని కోరారు. 

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న కొన‌సాగుతుండ‌టంతో.. సామాజిక దూరం పాటించాల్సిన గ‌డువును మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 1,42,226 మందికి క‌రోనా సోక‌గా.. వారిలో 2,493 మంది మ‌ర‌ణించారు. మ‌రో 4,443 మంది కోలుకున్నారు.   

Also Read | కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుందో చెప్పిన బాల జ్యోతీష్యుడు