Nikki Haley: భారత్ చుట్టూ అమెరికా ఎన్నికల ప్రచారం? అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

నా తల్లిదండ్రులు మెరుగైన జీవితం కోసం భారతదేశాన్ని విడిచిపెట్టారు. అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ సౌత్ కరోలినాలోని బాంబెర్గ్‌ వరకు చేరుకున్నారు. వారికి ఇక్కడ ఆ జీవితం దొరికింది. 2,500 జనాభా ఉన్న మా చిన్న పట్టణం మమ్మల్ని ప్రేమించింది. ఇక్కడ మేము మాత్రమే భారతీయ కుటుంబం. అయినప్పటికీ ఇక్కడ అలాంటి బేధాలు ఎప్పుడూ కనిపించలేదు

Nikki Haley: భారత్ చుట్టూ అమెరికా ఎన్నికల ప్రచారం? అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

American election campaign around India? Interesting comments from presidential candidate Nikki Haley

Updated On : February 16, 2023 / 8:56 AM IST

Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచం మొత్తానికి ఆసక్తి ఉంటుంది. ప్రపంచంపై ఆధిపత్యం ఉన్న అగ్రరాజ్యం కావడం చేత చాలా దేశాలు ఆ దేశ ఎన్నికలపై ఓ కన్నేసి ఉంచుతాయి. ఇంతటి ప్రతిష్టాత్మక ఎన్నికలు భారత్ చుత్తూ తిరగబోతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ అప్పుడే ప్రచారం ప్రారంభించారు. బుధవారం జరిగిన తన మొట్టమొదటి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ భారత సంతతికి చెందిన వారసురాలిగా తాను గర్వపడుతున్నానని ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

Tripura Assembly Polls: అగర్తలాలో ఓటు వేసిన ముఖ్యమంత్రి మాణిక్ సాహా

దక్షిణ కరోలినా నుంచి గవర్నర్‭గా ఉన్న నిక్కీ(51), ఐక్యరాజ్య సమితికి అమెరికా అంబాసిడర్‭గా కూడా పని చేశారు. ఇక బుధవారం దక్షిణ కరోలినాలో తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘‘ఇప్పుడున్న కాలంలో మనం అనుకున్నవి, అనుభవించే వాటిని మరింత ఉన్నతంగా తీర్చిద్దగలమని గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ నమ్మకంతో ఉన్నాను. నా జీవితమంతా ఎంతగానో చూశాను. ఒక గోధుమ రంగు అమ్మాయిగా, నలుపు-తెలుపు ప్రపంచంలో పెరుగుతున్నప్పుడు, అమెరికా వాగ్దానాలు ఎప్పుడూ నా కల్ల ముందు మెదులుతూనే ఉంటాయి. అమెరికా జాత్యాహంకార దేశం ఏమీ కాదు’’ అని అన్నారు.

Minister Buggana Rajendranath : త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన : మంత్రి బుగ్గన

ఇంకా ఆమె మాట్లాడుతూ “ప్రపంచాన్ని అమెరికా స్వాతంత్ర్యం, శాంతిలో నడిపించడాన్ని చూస్తున్నాను. ఈ దృక్పథం కేవలం నాది మాత్రమే కాదు. ఇది మన దేశ చరిత్ర, మన దేశ ప్రధాన అంశం. ఇదే 50 సంవత్సరాల క్రితం నా తల్లిదండ్రులకు పిలుపునిచ్చింది. నా తల్లిదండ్రులు భారత్ నుంచి వలస వచ్చినవారు. భారతీయ వలసదారులకు నేను గర్వకారణమైన కుమార్తెని” అని అన్నారు. నిక్కీ హేలీ 1972లో సౌత్ కరోలినాలోని బాంబెర్గ్‌లో సిక్కు తల్లిదండ్రులు అజిత్ సింగ్ రంధవా, రాజ్ కౌర్ రంధవా దంపతులకు జన్మించారు. వీరు పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్లారు. అనంతరం 1960లో అమెరికాకు వలస వెళ్లారు. మొదట సిక్కు సంప్రదాయాల ప్రకారమే పెరిగిన నిక్కీ.. 1996లో మైఖేల్ హేలీని వివాహం చేసుకున్న అనంతరం క్రైస్తవ మతంలోకి మారారు.

Adani Group: అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ జరపాలని ఆర్బీఐ, సెబీకి కాంగ్రెస్ లేఖ

అమెరికాలో పెరిగిన తన అనుభవాల గురించి నిక్కీ హేలీ మాట్లాడుతూ “నా తల్లిదండ్రులు మెరుగైన జీవితం కోసం భారతదేశాన్ని విడిచిపెట్టారు. అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ సౌత్ కరోలినాలోని బాంబెర్గ్‌ వరకు చేరుకున్నారు. వారికి ఇక్కడ ఆ జీవితం దొరికింది. 2,500 జనాభా ఉన్న మా చిన్న పట్టణం మమ్మల్ని ప్రేమించింది. ఇక్కడ మేము మాత్రమే భారతీయ కుటుంబం. అయినప్పటికీ ఇక్కడ అలాంటి బేధాలు ఎప్పుడూ కనిపించలేదు. మనం ఎవరో, మనమేమిటో, లేదా ఎందుకు అక్కడ ఉన్నామో ఎవరికీ తెలియదు. నిజానికి మేమంతా అమెరికన్లం” అని అన్నారు.

US Lottery Winner: అమెరికా చరిత్రలో అతిపెద్ద లాటరీ.. రూ.16 వేల కోట్ల ప్రైజ్ మనీ.. గెలుచుకుందెవరో తెలుసా?

అమెరికా అధ్యక్ష ఎన్నిక కోసం రిపబ్లికన్ పార్టీ నుంచి నిక్కీ హేలీ అధికారిక ప్రకటన చేసిందనే చెప్పుకోవాలి. గత ఏడాది చివర్లో వైట్ హౌస్ కోసం తన మూడవ బిడ్‌ను ఆమె ప్రకటించింది. కానీ ఆమెకు రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీదారుగా ఉన్నారు. ప్రెసిడెంట్ బ్యాలెట్‌లోకి ప్రవేశించే ముందు, వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ ప్రైమరీలో ఆమె గెలవాలి. అలా గెలిస్తే వచ్చే ఏడాది నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ఆమె బరిలో ఉంటారు.