అమెరికన్ కవయిత్రి లూయిస్‌ గ్లక్‌ కు సాహిత్యంలో నోబెల్.

Louise Gluck awarded Nobel Prize in Literature సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి ఈ ఏడాది అమెరికా కవయిత్రి లూయిస్‌ గ్లక్‌ను వ‌రించింది. సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని ఈసారి యూరప్‌, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్‌ రచయితకు స్వీడిష్‌ అకాడమీ అందచేస్తుందని పలువురు భావించినా అమెరికన్‌ రచయిత్రికే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందించింది. సాహిత్యంలో నోబెల్‌ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.


కాగా, త‌న ర‌చ‌న‌ల్లో అద్భుత‌మైన క‌వితా నైపుణ్యాన్ని లూయిస్‌ గ్లక్‌ ప్ర‌ద‌ర్శించిన‌ట్లు నోబెల్ క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. అమెరికాలోని యేల్ యూనివ‌ర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెస‌ర్‌గా చేస్తున్న లూయిస్‌ గ్లక్‌…ఆమె అనేక క‌విత‌ల‌ను ర‌చించారు. 1968లో తొలి ర‌చ‌న ఫ‌స్ట్‌బ‌ర్న్‌. చిన్న‌త‌నం నుంచి ఫ్యామిలీ లైఫ్ వ‌ర‌కు ఆమె అనేక ర‌చ‌న‌లు చేశారు. అతి తక్కువసమయంలోనే స‌మ‌కాలీన అమెరికా సాహిత్యంలో ప్ర‌ఖ్యాత క‌వయిత్రిగా ఆమె పేరుగాంచారు.


గ‌తంలో గ్లక్.. అనేక మేటి అవార్డుల‌ను గెలుచుకున్నారు. 1993లో పులిట్జ‌ర్ ప్రైజ్‌ను కైవ‌సం చేసుకున్నారామె. 2014లో నేష‌న‌ల్ బుక్ అవార్డును దక్కించుకన్నారు. లూయిస్ గ్లూక్ 1943లో న్యూయార్క్‌లో జ‌న్మించారు. ప్ర‌స్తుతం ఆమె క్యాంబ్రిడ్జ్‌లో నివ‌సిస్తున్నారు.