USA on Israel Palestine Conflict: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇజ్రాయెల్ కు పూర్తి మద్దతు ఇస్తూ వచ్చిన ఆయన.. సడెన్ గా మాట మార్చారు. ఇజ్రాయెల్ క్రూర చర్యలకు దిగుతోందని, గాజాను ఇజ్రాయెల్ తిరిగి స్వాధీనం చేసుకోవడం పెద్ద తప్పంటూ హెచ్చరించారు. హమాస్‌ను నాశనం చేయాలని, అయితే పాలస్తీనా రాజ్యానికి కూడా ఒక మార్గం ఉండాలని బిడెన్ అన్నారు.
ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దు వెంబడి ట్యాంకులను మోహరించింది. తీవ్రవాద సమూహాన్ని నిర్మూలించడానికి భారీ ఆపరేషన్ ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు మొత్తం గాజా స్ట్రిప్‌ను నాశనం చేశాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సోమవారం నాటికి 10వ రోజుకు చేరుకుంది.
పాలస్తీనా అథారిటీ చీఫ్ మహమూద్ అబ్బాస్‌తో భేటీ
హమాస్‌పై జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మొదటి నుంచి మద్దతు ఇస్తోంది. దీనికి ముందు, ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపేందుకు అమెరికా తన రెండు యుద్ధనౌకలను ఇజ్రాయెల్ సముద్ర సరిహద్దు సమీపంలోకి పంపింది. అనేక యుద్ధ విమానాలను పంపేందుకు కూడా ప్రణాళిక రూపొందించారు. అయితే, ఇప్పుడు గాజాను ఆక్రమించకూడదని ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు జో బిడెన్ స్వయంగా చేసిన ప్రకటన ఆసక్తిని రేపుతోంది. మధ్యప్రాచ్య దేశాల ప్రయోజనాల కోసం ఆయన ఇలా చేస్తున్నాడా అనే అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.
ఇది కూడా చదవండి: Israel-Gaza war : గాజాలో భూతల దాడులకు సిద్ధం…గాజాలో గర్జించనున్న ఇజ్రాయెల్ దళాలు
అమెరికా వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ అమెరికన్ టీవీ ఛానెల్ CBSతో మాట్లాడుతూ, ఈ వివాదం తీవ్రతరం కావడం, ఉత్తరాన రెండవ ఫ్రంట్ తెరవడం వల్ల, యుద్ధంలో ఇరాన్ ప్రమేయం ఉండే ప్రమాదం ఉందని చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా శుక్రవారం (అక్టోబర్ 13) జోర్డాన్‌లోని అమ్మన్‌లో పాలస్తీనా అథారిటీ చీఫ్ మహమూద్ అబ్బాస్‌ను కలిశారు.
ఐదు యుద్ధాల్లో గాజా అత్యంత ఘోరమైనది
అల్-ఖుద్స్ హాస్పిటల్ సమీపంలో ఐదు వైమానిక దాడులు జరిగాయని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపింది. ఇజ్రాయెల్ ఆసుపత్రిని ఖాళీ చేయడానికి శనివారం మధ్యాహ్నం గడువు ఇచ్చింది, రెడ్ క్రెసెంట్ దీన్ని తిరస్కరించింది. ఈ ఆదేశాన్ని పాటించడం అసాధ్యం అని పేర్కొంది. పోరాటం ప్రారంభమైనప్పటి నుంచి 2,670 మంది పాలస్తీనియన్లు మరణించారని, 9,600 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు వైపులా జరిగిన ఐదు గాజా యుద్ధాలలో ఇది అత్యంత ఘోరమైనదని రెడ్ క్రెసెంట్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: ఇజ్రాయెల్ ప్రతిదాడికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గాజా.. అంత్యక్రియలూ కష్టమే అవుతున్నాయి
హమాస్ అక్టోబర్ 7న చేసిన దాడిలో 1,400 కంటే ఎక్కువ మంది ఇజ్రాయిలీలు మరణించారు. వీరిలో ఎక్కువ మంది పౌరులు. ఇజ్రాయెల్ ప్రకారం, పిల్లలతో సహా కనీసం 155 మందిని హమాస్ సైనికులు బంధించి గాజాకు తీసుకువెళ్లారు. 1973లో ఈజిప్ట్, సిరియాతో వివాదం తర్వాత ఇజ్రాయెల్‌కు ఇది అత్యంత ఘోరమైన యుద్ధం. ఈ యుద్ధంలో పాలస్తీనా పౌరుల మరణాలు 2014 యుద్ధంలో కంటే తక్కువగానే ఉన్నాయి. 2014 యుద్ధంలో 50 రోజుల్లో 2200 మంది పాలస్తీనియన్లు చనిపోగా, ఈసారి 2670 మంది మరణించారు.