Drink Sea Water : ఇకనుంచి సముద్రపు నీటిని తాగొచ్చు!

అమెరికాలోని ప్రెయిరీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు సముద్ర జలాలపై ఉండే నీటి ఆవిరిని ఒడిసిపట్టే నూతన విధానాన్ని కనుగొన్నారు. ఆ నీటి ఆవిరి స్వచ్ఛమైన నీరుగా గుర్తించారు.

Drink Sea Water : ఇకనుంచి సముద్రపు నీటిని తాగొచ్చు!

sea water

Drink Sea Water : ప్రపంచవ్యాప్తంగా నదీ జలాలు అడుగంటిపోతున్నాయి. సముద్రపు నీరు ఉప్పుగా ఉండటం మూలంగా తాగటానికి పనికిరావు. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుతుండటంతో నీటి వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో జనాభాకు తగ్గట్లు తాగునీటిని సరఫరా చేయడం కష్టతరమవుతోంది. మురుగు నీరు శుద్ధి, క్లౌడ్ సీడింగ్, డీసాలినేషన్ పద్ధతులు కొంత మేరకే పని చేస్తాయి.

అయితే శాస్త్రవేత్తలు ఈ సమస్యలకు పరిష్కారం చూపారు. అమెరికాలోని ప్రెయిరీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు సముద్ర జలాలపై ఉండే నీటి ఆవిరిని ఒడిసిపట్టే నూతన విధానాన్ని కనుగొన్నారు. ఆ నీటి ఆవిరి స్వచ్ఛమైన నీరుగా గుర్తించారు.

Milky Sea: తొలిసారి కెమెరా కంటపడ్డ పాల సముద్రం

దాన్ని వినియోగించుకోగలిగితే కరువు ప్రాంతాల్లో చాలా వరకు తాగునీటి సమస్యకు పరిష్కారం చూపవచ్చని ప్రొ.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ లో ప్రచురించారు.