పాక్‌లో బయటపడ్డ బుద్ధుని విగ్రహం.. యాంటీ ముస్లింగా భావించి ధ్వంసం చేసిన కార్మికులు

పాక్‌లో బయటపడ్డ బుద్ధుని విగ్రహం.. యాంటీ ముస్లింగా భావించి ధ్వంసం చేసిన కార్మికులు

Updated On : July 18, 2020 / 10:01 PM IST

పురాతన బౌద్ధ విగ్రహం.. పాకిస్తాన్ లోని తఖ్త్ బాహి ప్రాంతంలో బయటపడింది. మారథాన్ జిల్లాలోని ఖైబర్ పక్తున్‌ఖ్వాలో ఓ ఇల్లు కోసం తవ్వుతుండగా విగ్రహం బయటపడింది. స్థానిక నిర్మాణ కార్మికులు అది ఇస్లామేతర వస్తువుగా భావించి పగులగొట్టేశారు. ఓ ఇంటికి ఫౌండేషన్ వేసేందుకు తవ్వుతుండగా పురాతన విగ్రహం బయటపడింది.

స్థానికులు అది ఇస్లామేతర విగ్రహం అని భావించారు. అంతే ఓ వ్యక్తి దానిని ధ్వంసం చేసి ముక్కలు చేసేశాడు. ఈ ఘటనలో సుత్తితో పగులగొడుతుండగా వేరొకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనపై ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ డైరక్టర్ అబ్దుల్ సమద్ విషయం అధికారులకు తెలియజేశామని.. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.

ఖైబర్ పక్తున్‌ఖ్వా పాత పేరు ఘాంధారా. పైగా ఆ ప్రాంతంలో చాలా మంది బౌద్ధతత్వం ఫాలో అయ్యేవాళ్లే ఉంటారు. 2017లో రెండు చాలా అరుదైన బౌద్ధ విగ్రహాలు హరిపుత్ జిల్లాలోని భామల ప్రాంతంలో ఆర్కియలాజికల్ సైట్ లో బయటపడ్డాయి. బుద్ధుని మరణం తర్వాత దొరికిన అతి పెద్ద విగ్రహం ఇక్కడే దొరికింది. అమెరికన్ ల్యాబొరేటరీ కూడా దీనిని వెరిఫై చేసి థర్డ్ సెంచరీ బీసీ కంటే ముందు విగ్రహమని కన్ఫామ్ చేశారు.

పేషావర్ మ్యూజియం కూడా ప్రపంచంలోని అతి పురాతనమైన బుద్ధ విగ్రహ ఆర్కియాలజికల్ పీసెస్ ను డిస్ ప్లేకు ఉంచుతారు. రెండేళ్ల క్రితం మ్యూజియంలోని పొడవైన బౌద్ధ విగ్రహం.. స్విట్జర్లాండ్ కు తరలించారు. 100రోజుల ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లో భాగంగా అక్కడకు పంపారు.