Solar Eclipse Animals : అమెరికాలో సూర్యగ్రహణం సమయంలో నిశ్శబ్దంతో వింతగా ప్రవర్తించిన జంతువులు!

Solar Eclipse Animals : గ్రహణ ప్రభావం జంతువులపై ఉంటుందా? గ్రహణం సంభవించినప్పుడు జంతువులు ఎలా స్పందిస్తాయి? వాటి ప్రవర్తనా ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Solar Eclipse Animals : అమెరికాలో సూర్యగ్రహణం సమయంలో నిశ్శబ్దంతో వింతగా ప్రవర్తించిన జంతువులు!

Animals Displayed Quiet And Unusual Behaviour During Solar Eclipse In US

Solar Eclipse Animals : ఉత్తర అమెరికాలో ఏప్రిల్ 8న సంభవించిన సూర్యగ్రహణం పది లక్షల మందిని ఆకర్షించింది. ఈ గ్రహణం సమయంలో చాలామంది పార్టీలు చేసుకోగా, పండుగలు, సామూహిక వివాహాలు జరిగాయి. అంతేకాదు.. సూర్యగ్రహణం సమయంలో అనేక జంతువులు నిశ్శబ్దంగా ఉండిపోయాయి. కొన్ని జంతువులు మాత్రం చాలా వింతగా ప్రవర్తించాయి. అందులో జిరాఫీలు, గొరిల్లాలు, సింహాలు, చిలుకలు, రాజహంస వంటి జంతువులు వింతగా ప్రవర్తించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా, సంపూర్ణ గ్రహణాలు అరుదుగా సంభవిస్తుంటాయి..

Read Also : Total Solar Eclipse 2024 : ఈ సంవత్సరంలో మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు? తేదీ, సమయం వివరాలివే.. భారత్‌లో కనిపిస్తుందా?

నిశ్శబ్దంగా ఉండిపోయిన జంతువులు :
ఈ సమయంలో జంతువులపై గ్రహణ ప్రభావం పడుతుందనే విషయం చాలా తక్కువగా తెలుసు. టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్ జూతో సహా గ్రహణం సమయంలో అనేక జూ పార్కుల్లో శాస్త్రవేత్తలు జంతువులను పరిశీలించారు. అయితే, జూపార్కుల్లో చాలా జంతువులు నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ, గొరిల్లాలు, సింహాలు, లెమర్‌లతో సహా కొన్ని జంతువులు సాధారణం కన్నా ఎక్కువ చురుకుదనంగా కనిపించాయి. జంతువుల్లో పెరిగిన ఆందోళన లేదా నాడీ ప్రవర్తనల సంకేతాలను గమనించలేదని, గ్రహణం విడే సమయానికి అన్ని దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నాయని జూపార్క్ ప్రతినిధి తెలిపారు.

జంతువులపై గ్రహణ ప్రభావం :
కొన్ని జంతువులు గ్రహణం సమయంలో చీకటిగా ఉండటంతో రాత్రి సమయమని లోపలికి వెళ్లిపోయినట్టుగా కనిపించింది. గొర్రిల్లాలు, జిరాఫీలు, ఏనుగులు, కోటిస్, బోనోబోస్, అల్డబ్రా తాబేళ్లు కూడా రాత్రిగా భావించి లోపలికి వెళ్లాయి. మరోవైపు, రాత్రిపూట సంచరించే జంతువులు మాత్రం వింతంగా ప్రవర్తించాయి. టెక్సాస్ జూపార్క్‌లో రింగ్‌టైల్ పిల్లి, రెండు గుడ్లగూబ జాతులు పగటిపూట బయటకు వచ్చి కనిపించాయి. డల్లాస్ జూపార్క్‌లోని జూకీపర్లు గ్రహణం సమయంలో జిరాఫీలు, జీబ్రాలు పరిగెత్తడాన్ని గుర్తించారు.

మిగతా గొర్రిల్లాలు గ్రహణం సమయంలో రాత్రిపూట మాత్రమే తెరిచే తలుపు వైపు వెళ్లగా, చింపాంజీలు జూలో అటు ఇటు తిరగడం చేస్తూ వింతగా ప్రవర్తించాయి. సూర్యగ్రహణం సమయంలో, డల్లాస్ జూలో ఒక ఉష్ట్రపక్షి గుడ్డు పెట్టింది. ఇతర పక్షులు నిశ్శబ్దంగా ఉండిపోయాయి. పెంగ్విన్‌లు, ఫ్లెమింగోలు ఒకదానితో ఒకటి గట్టిగా కౌగిలించుకున్నాయి. ఇండియానాపోలిస్ జూలో పక్షులు కూడా వింతగా ప్రవర్తించాయని జూ అధికారి తెలిపారు. రాత్రిపూట తరచుగా శబ్దం చేసే పక్షులు, చిలుకలు, బుడ్గేరిగర్ నిశ్శబ్దంగా ఉండిపోయాయి.

2017లో సూర్యగ్రహణం సమయంలో ఇదే ప్రవర్తన :
ముఖ్యంగా, 2017లో కూడా సూర్యగ్రహణం సమయంలో జంతువులలో ఇలాంటి ప్రవర్తనే కనిపించింది. అవుట్‌లెట్ ప్రకారం.. 2020 అధ్యయనంలో సౌత్ కరోలినాలోని జూలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు సహా 17 జాతులు ఉన్నాయి. దాదాపు 75 శాతం జాతులు గ్రహణం సమయంలో ఏదో ఒక రకమైన వింత మార్పును ప్రదర్శించాయని నివేదించింది. కొన్ని జంతువులు భయంగా కనిపించగా, చాలావరకు సాధారణంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో మాదిరిగా ప్రవర్తించడం కనిపించింది.

Read Also : సూర్యగ్రహణం ఫోటోలను ఇలా తీస్తే.. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా దెబ్బతింటుంది జాగ్రత్త.. నాసా హెచ్చరిక!