Total Solar Eclipse 2024 : ఈ సంవత్సరంలో మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు? తేదీ, సమయం వివరాలివే.. భారత్‌లో కనిపిస్తుందా?

Total Solar Eclipse 2024 : సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా? ఏ తేదీలో ఏ సమయంలో గ్రహణం సంభవించనుంది? భారత్‌లో కనిపించనుందా? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Total Solar Eclipse 2024 : ఈ సంవత్సరంలో మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు? తేదీ, సమయం వివరాలివే.. భారత్‌లో కనిపిస్తుందా?

Total Solar Eclipse 2024 _ Surya Grahan Date, Time, and Where To Watch in India

Total Solar Eclipse 2024 : ఏప్రిల్‌లో నిర్దిష్ట సమయంలో జరగబోయే సంపూర్ణ సూర్యగ్రహణం 2024ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాసా ప్రకారం.. ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం, దక్షిణ పసిఫిక్ మీదుగా ప్రారంభమవుతుంది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించే ముందు మెక్సికో పసిఫిక్ తీరానికి చేరుకుంటుంది. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడాలనుకునేవారు ఏ తేదీలో ఏ సమయంలో చూడవచ్చు.. భారత్‌లో సూర్యగ్రహణం కనిపిస్తుందా? లేదా అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2024లో మొత్తం 5 గ్రహణాలు :
ఖగోళంలో ఈ 2024 మొత్తంలో 5 గ్రహణాలు సంభవించనున్నాయి. ఇందులో 2 సూర్యగ్రహణాలు, 3 చంద్రగ్రహణాలు. వచ్చే ఏప్రిల్ 8న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణంగా పిలుస్తారు. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి.

అంతేకాదు.. సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు, భూమికి సూర్యుడు మధ్యగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి ఏప్రిల్ 8న సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

Read Also : FlixBus Services in India : భారత్‌లో ఫ్లిక్స్‌బస్ సర్వీసులు ప్రారంభం.. ప్రధాన నగరాల్లో ప్రయాణ ఆప్షన్లు.. ట్రావెల్ రూట్లు, టికెట్ల ధరలివే!

గత ఏడేళ్లలో రానున్న రెండో సూర్యగ్రహణం :
గత 7ఏళ్లలో ఇలాంటి సూర్యగ్రహణం సంభవించనుడటం రెండోసారి కానుంది. గతంలో 2017 ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. రాబోయే సంపూర్ణ సూర్యగ్రహణం 2024 సంవత్సరంలో అతిపెద్ద ఖగోళ సంఘటనగా భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న తాజా అధికారిక వివరాల ప్రకారం.. మొదటి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న జరగబోతోంది. ఈ అద్భుతమైన ఖగోళ దృగ్విషయాన్ని చూసే ఈ అరుదైన అవకాశం కోసం ఎంతోమంది ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Total Solar Eclipse 2024 _ Surya Grahan Date, Time, and Where To Watch in India

Total Solar Eclipse 2024

సూర్య గ్రహణ తేదీ, సమయాలు ఇవే :
2024 మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం లేదా సూర్య గ్రహణం మీనరాశిలో చైత్ర మాసంలో జరగనుంది. తాజా వివరాల ప్రకారం.. సంపూర్ణ సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న సంభవిస్తుంది. సూర్యగ్రహణం ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9, 2024న తెల్లవారుజామున 2:22 గంటలకు ముగుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణాన్ని చూడాలనుకుంటే తేదీ, సమయాన్ని గుర్తుంచుకోండి.

భారత్‌లో కనిపిస్తుందా? :
తాజా వివరాల ప్రకారం.. భారత్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించదు. దేశంలోని ప్రజలు విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకంటే.. సూర్యగ్రహణం సమయంలో తప్పనిసరిగా అనుసరించాల్సిన ఆచారాలను పాటించాల్సిన అవసరం లేదు.

Read Also : World Cancer Day 2024: ఈ ప‌థ‌కం ద్వారా క్యాన్స‌ర్ బాధితులు రూ.15 ల‌క్ష‌ల వరకు సాయం పొందవచ్చు.. ఎలాగంటే?