World Cancer Day 2024: ఈ ప‌థ‌కం ద్వారా క్యాన్స‌ర్ బాధితులు రూ.15 ల‌క్ష‌ల వరకు సాయం పొందవచ్చు.. ఎలాగంటే?

దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న‌వారై ఉండాలి.. దానికోసం మండల రెవెన్యూ ఆఫీసర్ నుంచి వార్షికాదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం సమర్పించాలి.

World Cancer Day 2024: ఈ ప‌థ‌కం ద్వారా క్యాన్స‌ర్ బాధితులు రూ.15 ల‌క్ష‌ల వరకు సాయం పొందవచ్చు.. ఎలాగంటే?

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న క్యాన్సర్ రోగులకు ఆర్థిక సాయం అందించడం కోసం ‘రాష్ట్రీయ ఆరోగ్య నిధి’ అనే సంక్షేమ పథకాన్నికేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా సోకే మాయా రోగం క్యాన్సర్. పేద ప్రజలకు క్యాన్స‌ర్‌ ట్రీట్మెంట్ అంటే అంత తేలికైన వ్య‌వ‌హారం కాదు.

ఎంతో ఖర్చుతో కూడుకున్న‌ది. మరోలా చెప్పాలంటే పేద‌వారికి ఈ క్యాన్స‌ర్ నెత్తిన పిడుగులాంటిదే. నిరుపేదలు ట్రీట్మెంట్ కి అయ్యే ఖ‌ర్చు భ‌రించే స్తోమ‌త లేక, ఈ మాయ రోగ విపత్కర పరిస్థితి నుంచి బయటపడడం కోసం స్వచ్ఛంద/ క్రౌడ్ ఫండింగ్ సంస్థల నుంచి సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తుంటారు.

పేద క్యాన్సర్ రోగులకు వైద్యానిక‌య్యే ఖర్చు రూ.15 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం నుండి అమలు అవుతున్న రాష్ట్రీయ ఆరోగ్య నిధి ప‌థ‌కం ద్వారా పొందవచ్చనే విషయం చాలామందికి తెలువదు. ఇందులో భాగంగానే వరల్డ్ కాన్సర్ డే సందర్భంగా ఈ ఆర్టికల్ ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. దురదృష్టం ఏంటి అంటే గత నాలుగు సంవత్సరాలలో మన తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది క్యాన్సర్ బారిన పడిన కేవలం వందలోపే ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు (నివేదికల ఆధారంగా).

దేశంలోని ఈ 27 కేంద్రాలలో (ఈ కింద ఇవ్వబడిన) మాత్రమే క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ సంబంధిత హాస్పిటల్ ధ్రువపత్రాలతో ఆర్థిక సాయం కోసం మనం అప్లై చేసుకోవచ్చు.

List of 27 Regional Cancer Centres

అయితే మొదటిసారి ట్రీట్మెంట్ కోసం ఈ పథకం కింద రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్థిక సాయం చేస్తారు, ఒకవేళ అంతకన్నా ఎక్కువ అవసరం అయితే అడ్మిట్ అయినా హాస్పిటల్ తో సంబంధిత పథక కమిటీ సభ్యులు చర్చలు జరిపి రోగి ప‌రిస్థితిని అధ్య‌య‌నం చేసిన త‌రువాత అవ‌స‌రాన్ని బ‌ట్టి గరిష్టంగా రూ. 15 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తారు. ఈ డబ్బులు కేవలం రేడియేష‌న్, యాంటీ క్యాన్స‌ర్ కీమోథెర‌పీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేష‌న్, రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, క్యాన్స‌ర్ గ‌డ్డ‌ల ఆపరేషన్ వంటి చికిత్స‌ల‌కు మాత్రమే ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ఈ ప‌థ‌కం పొంద‌డానికి అర్హ‌త‌లు

1) దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న‌వారై ఉండాలి.. దానికోసం మండల రెవెన్యూ ఆఫీసర్ నుంచి వార్షికాదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం సమర్పించాలి.
2) క్యాన్సర్ వ్యాధి సోకినట్లు ధ్రువ ప‌త్రాలుండాలి.
3) ప్ర‌భుత్వ ఉద్యోగులు ఈ ప‌థ‌కానికి అర్హులు కాదు.

ముఖ్య గమనిక: క్యాన్స‌ర్ రోగుల‌కు సంబంధించి దేశంలోని పైన పేర్కొన్న 27 ప్రాంతీయ క్యాన్స‌ర్ కేంద్రాలలో చికిత్స చేసుకుంటున్న వారికీ మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో కానీ వేరే హాస్పిటల్లో కానీ చికిత్స చేసుకుంటున్న వారికీ డబ్బులు ఇవ్వరు.

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల్లో రిజిన‌ల్ క్యాన్స‌ర్ సెంట‌ర్లు: 

రెండు తెలుగు రాష్ట్రాలకు క‌లిపి రీజిన‌ల్ క్యాన్స‌ర్ సెంట‌ర్ హైద‌రాబాద్‌లో ఉంది. ఎంఎన్‌జె ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, ఎంఎన్‌జె ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్, రెడ్ హిల్స్, లక్డీకాపూల్, హైదరాబాద్ -500004

ఫోన్ : 040-23318422 / 414 / 424 / 23397000

మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన ఆఫీషియల్ లింక్స్ పై క్లిక్ చేసి చదవండి:

https://kathua.nic.in/financial-assistance-schemes-for-patients/

https://main.mohfw.gov.in/major-programmes/poor-patients-financial-assistance/ran-health-ministers-cancer-patient-fund

హెల్త్ మినిస్ట‌ర్స్ క్యాన్స‌ర్ పేషెంట్ ఫండ్ మార్గదర్శకాలు >> guidelines-of-health-minister’s-cancer-patient-fund

Risk Of Diabetes In Youngsters : యువతలో మధుమేహం ముప్పును పెంచే ప్రధాన కారణాలివే.. మీ ఆరోగ్యం మీ చేతుల్లో..!