షిప్‌లో భయం..భయం.. : మరో 67మందికి కరోనా వైరస్
కొవిడ్-19(covid19.. అదేనండి.. కరోనా వైరస్(corona virus).. ప్రపంచవ్యాప్తంగా భయాందోళన సృష్టిస్తోంది. మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. చైనాతో పాటు ప్రపంచ దేశాలను

కొవిడ్-19(covid19.. అదేనండి.. కరోనా వైరస్(corona virus).. ప్రపంచవ్యాప్తంగా భయాందోళన సృష్టిస్తోంది. మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. చైనాతో పాటు ప్రపంచ దేశాలను
కొవిడ్-19(covid19.. అదేనండి.. కరోనా వైరస్(corona virus).. ప్రపంచవ్యాప్తంగా భయాందోళన సృష్టిస్తోంది. మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. చైనాతో పాటు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక జపాన్ లో సముద్ర జలాల్లో నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్ విహారం నౌకలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. షిప్ లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా 67మందికి కరోనా సోకినట్టు డాక్టర్లు గుర్తించారు.
చైనా తర్వాత అత్యధిక మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నది యొకొహామా తీరంలో నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలోనే(Diamond Princess cruise ship). మూడు వేలకు పైగా ప్రయాణికులు భయంతో కాలం గడుపుతున్నారు. ఈ నౌకలో తొలుత ఇద్దరికి సోకిన వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. తాజాగా 67మందికి కరోనా సోకినట్టు జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి కాటో శనివారం(ఫిబ్రవరి 15,2020) తెలిపారు. కాగా, ఒకే రోజు 39 మందికి సోకడంతో అక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది. నౌకలో మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 175కుపైగానే ఉంది. వీరిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు.
కాగా, షిప్ లో ఒక నిర్ణీత ప్రదేశంలో అందరూ సన్నిహితంగా ఉంటారని, కామన్ గా ఉండే డైనింగ్ టేబుల్, స్నానపు గదులు, స్విమ్మింగ్ పూల్ నే వాడతారని, ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షిప్ లో వైరస్ చాలా వేగంగా వ్యాపించడానికి కారణం ఇదే అంటున్నారు. హాంకాంగ్ లో దిగిన ఒక్క వ్యక్తికి సోకిన ఈ వ్యాధి ప్రస్తుతం 175 మందికిపైగా సంక్రమించింది.
ఒకేరోజు 39 మందికి సోకడాన్ని బట్టి చూస్తే ఇది ఎంత వేగంగా, సులువుగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చని డాక్టర్లు తెలిపారు. మనం తీసుకునే జాగ్రత్తల్లో లోపాల వల్ల కూడా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. వైరస్ సోకినా లక్షణాలు బయటపడని వారి నుంచి కూడా వ్యాపిస్తోందని తెలిపారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లలో ఉండే వైరస్ 6 అడుగులు దూరంలో ఉండే వ్యక్తులకు కూడా సోకుతుందని వివరించారు. శరీరం వెలుపల వైరస్ ఎంతవరకు బతకగలుగుతుంది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో కరోనా వైరస్ రోగుల మధ్య బతకుతామో లేదోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. తమకూ కరోనా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని, క్రూయిజ్ షిప్ నుంచి రక్షించండని వేడుకుంటున్నారు. విహార నౌకలో ప్రయాణికులను ఆరు అడుగుల దూరంలో నడవమని కోరుతున్నారు. కరోనా వైరస్ సోకిన రోగులకు ఆహారాన్ని వారి గదులకు పంపుతున్నారు. జపాన్ తీరంలోని సముద్రంలో నిర్బంధించిన నౌకలో ప్రయాణికుల కదలికలపై ఆంక్షలు విధించారు.
వైరస్ కారణంగా.. ప్రయాణికులను షిప్ లో బంధించింది జపాన్ ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. కరోనా లేదని తెలుసుకున్నాకే ఒక్కొక్కరిని బయటకు పంపుతున్నారు. quarantineలో షిప్ ఉండి 10 రోజులైంది. వ్యాధి సోకని వాళ్లను కూడా అక్కడే దిగ్బంధించడంతో వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. షిప్ లోని ప్రయాణీకులను జపాన్ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చేసరికి కొన్ని వందల మందికి కరోనా సోకచ్చన్న భయం వైద్య నిపుణులది. తెలిసిన వైరస్ కు మందుంది. కరోనా లాంటి ప్రాణాంతక వైరస్ ల వ్యాప్తిని అడ్డుకోవాలంటే బాధితులను దూరంగా ఉంచడమే మంచిదన్నది మరికొందరి మాట. కరోనాకు మందు లేదు. వ్యాక్సిన్ తయారీకి నెలల సమయం పడుతుంది. అందుకే బాధితులను దూరంగా ఉంచి వైద్యం చేయడమే మంచిదని అంటున్నారు. విహారయాత్రం కోసం అని వెళ్లిన ప్రయాణికులు.. ఇలా షిప్ లో బందీ కావాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రాణాలతో బయటపడతామో లేదోనని బెంగ పెట్టుకున్నారు.