బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో మరొక జంట విడాకులకు సిద్ధం.. పెద్దలు క్యాన్సర్‌తో పోరాడుతున్న వేళ లొల్లి 

గతంలో తన తల్లి, దివంగత వేల్స్ ప్రిన్సెస్‌ డయానా విడాకులు తీసుకోవడానికి సాయపడిన లాయర్లనే తాజాగా ప్రిన్స్ విలియం నియమించుకున్నారు.

బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో మరొక జంట విడాకులకు సిద్ధం.. పెద్దలు క్యాన్సర్‌తో పోరాడుతున్న వేళ లొల్లి 

Updated On : April 7, 2025 / 3:43 PM IST

బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో మరొక జంట విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో తన తల్లి, దివంగత వేల్స్ ప్రిన్సెస్‌ డయానా విడాకులు తీసుకోవడానికి సాయపడిన లాయర్లనే తాజాగా ప్రిన్స్ విలియం నియమించుకున్నారు. దీంతో ప్రిన్స్ విలియం కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో విడాకులు తీసుకున్న మరికొన్ని జంటలు కూడా ఉన్నాయి. ఎన్ని దశాబ్దాలు గడిచినా విడాకుల విషయంలోనూ పరిస్థితులు మారడం లేదు.

ఓవైపు ఆ రాయల్ ఫ్యామిలీలోని పెద్దలు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కింగ్ చార్లెస్ III, వేల్స్ ప్రిన్సెస్‌ కేథరీన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ సమయంలోనూ ఆ కుటుంబంలో ఇతర వివాదాలు ఆగడం లేదు.

తాజాగా, ప్రిన్స్ విలియం విడాకుల కోసం న్యాయవాదిని నియమించుకున్నట్లు తెలియడంతో ఆ ప్యాలెస్‌ మొత్తం షాక్‌కు గురయిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.

ప్రిన్స్ విలియం భార్య పేరు కేట్ మిడిల్టన్ (కేథరీన్ అని మరో పేరు కూడా ఉంది). వారిద్దరికి 2011 ఏప్రిల్‌ 29న పెళ్లి జరిగింది. వారిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ప్రిన్స్ విలియం న్యాయవాదిని నియమించుకున్నారు. దీన్ని ఊహించని చర్యగా అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.

ప్రిన్స్ విలియం తన తండ్రి కింగ్ చార్లెస్‌కు సన్నిహితంగా ఉండే న్యాయవాదులు హార్బాటిల్, లూయిస్‌లను కాదని, అందుకు బదులుగా మిష్కాన్ డీ రేయా అనే వేరే న్యాయ సంస్థను తన కేసుల కోసం నియమించుకున్నారు. 1996లో ఈ న్యాయ సంస్థే ప్రిన్సెస్‌ డయానాకు ప్రిన్స్‌ చార్లెస్‌తో విడాకులు ఇప్పించింది.

గతంలో ఈ ఫ్యామిలీలో విడాకులు తీసుకుంది వీళ్లే..
డయానా తల్లిదండ్రులు ఫ్రాన్సిస్ షాండ్ కిడ్, జాన్ స్పెన్సర్ 1969లో విడాకులు తీసుకున్నారు. డయానా 1996లో ప్రిన్స్ చార్లెస్‌కు విడాకులు ఇచ్చారు. డయా ఆమె సోదరుడు చార్లెస్ స్పెన్సర్ రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. డయానా సోదరి లేడీ సారా మెక్‌కోర్కోడేల్ 1996లో నీల్ మెక్‌కోర్కోడేల్‌కు విడాకులు ఇచ్చారు. ఇప్పుడు డయానా కుమారుడు ప్రిన్స్ విలియం కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.