హార్ట్ ఇంప్లాంట్స్ వ్యక్తులకు ఐఫోన్ 12 ప్రాణాంతకంగా మారొచ్చు

iPhone 12 for heart implants: యాపిల్ ఐఫోన్ 12 ఫేస్ మేకర్స్ లాంటి హార్ట్ ఇంప్లాంట్స్ చేసుకున్న వారికి ప్రాణాంతకం కావొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. జర్నల్ హార్ట్ రిథమ్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. ఐఫోన్‌ను ఫేస్ మేకర్‌కు దగ్గరగా వాడితే కొద్ది విరామంతోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మిగిలిన ఫ్యూచర్ ఫోన్లకు ఐఫోన్ కు ఉన్న మ్యాగ్నెట్ తేడా కారణంగా సమస్యలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అంతకుముందు రీసెర్చ్‌లో మెడ్‌ట్రానిక్ కంపెనీ తయారుచేసిన పేస్‌మేకర్‍‌ వాడే వారు ఈ ఫోన్ వాడొద్దని యాపిల్ మ్యాగ్ సేఫ్ టెక్నాలజీ చెప్పింది. దానిపై పూర్తి స్థాయి రీసెర్చ్ కోసం జరిపిన రీసెర్చ్ లో ఈ విషయాలు బయటపడ్డాయి.

ఒరిజినల్ రీసెర్చ్ వెలువడిన తర్వాత ఐఫోన్ వాడే వారు ఫేస్ మేకర్ కు కనీసం ఆరు అంగుళాల దూరం వాడాలని చెప్పారు. అలాకాకుండా వైర్ లెస్ ఛార్జింగ్ పెట్టాలనుకునేవారు కచ్చితంగా అడుగు దూరంగా ఉండాలని సూచించారు. మిగిలిన ఐఫోన్ మోడల్స్ లాగే ఐఫోన్ 12 మ్యాగ్నటిక్ ఇంటర్‌ఫేస్ చూపిస్తుందని ముందుగా ఊహించలేదు.

యాపిల్‌కు.. మెడ్‌ట్రానిక్‌కు ఈ మేర వాదనలే జరిగాయి. మ్యాగ్‌సేఫ్ టెక్నాలజీ రూపంలో అడిషనల్ మ్యాగ్నెట్స్ అరేంజ్ చేయొద్దంటూ.. పేస్ మేకర్లను ఆపేసే రెగ్యూలర్ ఫోన్ లా డిజైన్ చేయకూడదని చర్చలు జరిగాయి.

మెడ్‌ట్రానిక్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఐఫోన్ టెక్నాలజీని విశ్లేషించాం. మెడ్‌ట్రానిక్ రెడీ చేసిన కార్డియాక్ రిథమ్ డివైజెస్ (పేస్ మేకర్స్, ఇంప్లాంటేబుల్ డిఫిబ్రిలేటర్స్, కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరఫీ డిఫిబ్రిలేటర్స్) వంటి వాటికి ఎటువంటి రిస్క్ ఉండదని చెప్పింది. దీనిపై యాపిల్ స్పందించింది.

ఒరిజినల్ స్టడీలో డివైజ్ పైన ఐఫోన్ 12ఉంచి ఇంప్లాంటెడ్ డిఫిబ్రిలేటర్ ను ఆపేయొచ్చని రీసెర్చర్ చెబుతున్నారు.

ఏదేమైనా ఈ స్టడీ కేవలం ఐఫోన్ 12 వాడే ఒకే ఒక్క వ్యక్తిపై జరిగింది కాబట్టి అతను రెగ్యూలర్ ఫోన్ వాడిని అలా జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది స్పష్టం కాలేదు. హార్ట్ డివైజెస్ పై మ్యాగ్నెట్స్ ప్రభావం కనిపిస్తాయనేది నిజమే. వాటికి దగ్గరగా మ్యాగ్నెట్ లు వస్తే ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.

దీనిపై యాపిల్ అప్ డేట్ ఇస్తూ.. వాడే ముందు డాక్టర్ ను సంప్రదించండి. మీరు ఎటువంటి మెడికల్ డివైజ్ వాడుతున్నారో తెలుసుకోండి. దాని మ్యాన్యుఫ్యాక్చర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని డివైజ్ సేఫ్ అవునో కాదో నిర్ణయించుకోండి. మెడికల్ డివైజ్ కు ఐఫోన్ ఎంత దూరంలో ఉండాలో క్లియర్ చేసుకుంటే సేఫ్ అని సూచించింది.

ట్రెండింగ్ వార్తలు