పురాతన స్ట్రీట్ ఫుడ్ షాపులు ఇలానే ఉండేవంట..!

Ancient Street Food Shop In Pompeii : స్ట్రీట్ ఫుడ్.. ఇప్పుడే కాదు.. పురాతన కాలం నుంచే ఎంతో ప్రసిద్ధిచెందింది. క్రీస్తు శకం 79(AD)లో అగ్నిపర్వత విస్ఫోటనంతో ఆ నగరమంతా భూస్థాపితమైంది. ఇప్పుడా నగరంలో ఓ పురాతన స్ట్రీట్ ఫుడ్ షాపు ఒకటి బయటపడింది. పాంపీలోని పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో ఈ ఫుడ్ షాప్‌ను కనుగొన్నారు. ఇది చూడటానికి అచ్చం ఫ్రెస్కోడ్ హాట్ ఫుడ్ అండ్ డ్రింక్స్ షాపు మాదిరిగానే కనిపిస్తోంది. హాట్ డ్రింక్స్ కౌంటర్ అయిన దీన్ని లాటిన్‌లో termopolium అని పిలుస్తారు. ఈ స్ట్రీట్ ఫుడ్ షాపు పురావస్తు పార్క్ రెజియో V సైట్‌లో ఉందని పురావస్తు సైంటిస్టులు కనుగొన్నారు. ఈ పురాతన ఫుడ్ షాపును అతి త్వరలో ఆవిష్కరించనున్నారు.
తవ్వకాల్లో బయటపడిన ఈ ఫుడ్ షాపులో 2వేల ఏళ్ల క్రితం నాటి పురాతన ఆహారపు జాడలను గుర్తించారు. టెర్రా కోటా జాడిలో ఆనాటి వేడి ఆహారపు ఆనవాళ్లు కనిపించాయి. వృత్తాకార రంధ్రాలతో కూడిన కౌంటర్‌లో వీటిని షాపు యజమానులు అమర్చినట్టు గుర్తించారు. కౌంటర్ ముందుభాగంలో ముదురు రంగు ఫ్రెస్కోలతో అలంకరించి ఉంది. కొన్ని జంతువుల చిత్రాలు కౌంటర్ ముందు ఉన్నాయి. అందులో కోడి, తలకిందులుగా వేలాడదీసిన రెండు బాతుల చిత్రాలు ఉన్నాయి. టెర్మోపోలియంను తవ్వడం ఇదే మొదటిసారి అని పోంపీ పురావస్తు పార్క్ డైరెక్టర్ Massimo Ossana అన్నారు.
పురావస్తు శాస్త్రవేత్తలు పటేరా అని పిలిచే బ్రౌంజ్ తాగే గిన్నె, వంటకాలు, సూప్‌లు, వైన్ ఫ్లాస్క్‌లు, ఆంఫోరా వంటలకు ఉపయోగించే సిరామిక్ జాడిని గుర్తించారు. నేపుల్స్‌కు ఆగ్నేయంగా 23 కి.మీ (14 మైళ్ళు) పోంపీ నగరం ఉంది. అగ్నిపర్వతం విస్ఫోటనంలో సుమారు 13,000 మంది ఖననం అయిన బూడిద, ప్యూమిస్ గులకరాళ్ళ కింద దుమ్ము ఉందని కనుగొన్నారు. ఇది అనేక అనుబాంబుల శక్తికి సమానమని అంటున్నారు. కౌంటర్ ముందు గీసిన బొమ్మలను పరిశీలిస్తే.. అక్కడ విక్రయించిన ఆహారం, పానీయాలను సూచిస్తాయని మానవ శాస్త్రవేత్త Valeria Amoretti అన్నారు.
ఇక కంటైనర్లలో పంది మాంసం, చేపలు, నత్తలు గొడ్డు మాంసం జాడలను గుర్తించామని ఆయన చెప్పారు. అనేక రకాల జంతు ఉత్పత్తులకు ఇది సాక్ష్యంగా నిలుస్తోందని పేర్కొన్నారు. గ్రీకో-రోమన్ జీవితాన్ని వర్ణించే అరుదైన డాక్యుమెంటేషన్ నగరాల్లో పాంపీ నగరం ఒకటిగా చెప్పవచ్చు. 66 హెక్టార్ల (165 ఎకరాల) పురాతన పట్టణంలో మూడింట రెండొంతుల భాగాన్ని మాత్రమే పురావస్తు శాఖ గుర్తించింది.