Ariana Viera: చావు గురించి వీడియో తీసుకున్న మోడల్.. యాక్సిడెంట్ రూపంలో నిజంగానే కౌగిలించుకున్న మృత్యువు

భవిష్యత్తులో జరిగే తన అంత్యక్రియల గురించి తాను ఈ వీడియోను రికార్డు చేస్తున్నానని తెలిపింది.

Ariana Viera: చావు గురించి వీడియో తీసుకున్న మోడల్.. యాక్సిడెంట్ రూపంలో నిజంగానే కౌగిలించుకున్న మృత్యువు

Ariana Viera - Venezuela

Ariana Viera – Venezuela : దక్షిణ అమెరికా (South America) దేశం వెనిజులా అందాల రాణి (Miss Venezuela) అరియానా వైరా కారు ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో మూడు వారాలుగా చికిత్స తీసుకుంది. మెల్లిగా కోలుకుంటోంది. ఈ సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయింది.

ఆమె వయసు 26 ఏళ్లు మాత్రమే. ఓర్లాండో (ఓర్లాండో)లో ఆమె కారు ఓ ట్రక్కును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. మోడల్ గా రాణిస్తున్న ఆమె.. ఈ యాక్సిడెంట్ జరగడానికి రెండు నెలల ముందు ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె తన అంత్యక్రియల గురించి మాట్లాడడం గమనార్హం.

భవిష్యత్తులో జరిగే తన అంత్యక్రియల గురించి తాను ఈ వీడియోను రికార్డు చేస్తున్నానని తెలిపింది. తనకు సంబంధించిన ఇటువంటి వీడియోలను ఎవరూ తీయలేరని, అందుకే తనకు తానే తీసుకుంటానని చెప్పింది. మేలో ఈ వీడియో రికార్డు చేసుకుని పోస్ట్ చేసింది. ప్రతిరోజు తాను ఏం చేస్తానో ఈ వీడియోలో వివరించింది. ఉదయాన్నే నిద్ర లేవడం, నీళ్లు తాగడం, ఇంట్లో తిరగడం వంటివి చూపించింది. ఈ వీడియో తీసుకున్న రెండు నెలలకే ఆమె చనిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Ariana Valentina (@arianaviera__)

Viral Video: అంతర్జాతీయ రేసులో ఎవరైనా ఇంత మెల్లిగా ఉరుకుతారా? ప్రేక్షకుల దిమ్మతిరిగిపోయింది..