Guinness Record: గాల్లో ఉన్న హెలికాప్ట‌ర్‌కు వేలాడుతు పుల్అప్స్‌ తో గిన్నిస్ రికార్డు..ఒక్క నిమిషంలో ఎన్నో తెలుసా?!

గాల్లో ఉన్న హెలికాప్ట‌ర్‌కు వేలాడుతు పుల్అప్స్‌ తో గిన్నిస్ రికార్డు సాధించాడో వ్యక్తి అలా ..ఒక్క నిమిషంలో ఎన్ని పుల్ అప్స్ అంటే..

Guinness World Records

Guinness World Records : అర్మేనియాకు చెందిన‌ రోమ‌న్ స‌హ్ర‌ద్యాన్ అనే వ్య‌క్తి గిన్నిస్ రికార్డు సాధించాడు. వరల్డ్ రికార్డు సాధించటంలో ఎవరి స్టైల్ వారిది..ఎవరి ఫీట్లు వారివి. రోమన్ కూడా అంతే ఓ డిఫరెంట్ ఫీట్ తో గిన్నీస్ రికార్డు సాధించాడు. రోమస్ సహ్రద్యాన్ ఏకంగా హెలికాప్ట‌రుకు వేలాడుతూ పుల్ అప్స్ చేశాడు.

Also read : Woman Guinness Record : తాడు మీద హై హీల్స్ తో జంప్ చేసి..మహిళ గిన్నిస్ రికార్డు

అదేదో ఆషామాషీగా ఏదో రాడ్ పట్టుకుని వేలాడుతు చేస్తేనే గిన్నీస్ రికార్డు రాదు కదా..అందుకే రోమన్ ఫుల్ డిఫరెంట్ గా ఆలోచించారు. హెలికాప్టర్ గాల్లో ఉండ‌గా దాన్ని ప‌ట్టుకొని పుల్అప్స్‌ చేశాడు. అలా ఒకే ఒక్క నిమిషంలో 23 పుల్అప్స్ చేసి రికార్డు సృష్టించాడు.

చాలామంది కింద ప‌డుకొని పుషప్స్ అంద‌రూ చేస్తారు. పుల్అప్స్ కూడా చాలామందే చేస్తారు.కానీ ఇలా గాల్లో ఎగురుతున్న హెలికాప్ట‌ర్‌ను ప‌ట్టుకొని పుల్అప్స్ చేయ‌డం అనేది చాలా చాలా డిఫరెంట్. అందుకే గిన్నిస్ బుక్ వారు ఏక్సప్ చేశారు. రోమన్ రికార్డు సాధించాడని ప్రకటించారు. అలా రోమ‌న్ అనే వ్య‌క్తి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. దానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also read :  World Biggest Strawberry : పావుకిలోకంటే పెద్ద స్ట్రాబెర్రీ గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు..