Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభాన్ని చక్కదిద్దే పనిలో ఆర్మీ..శాంతియుత పరిష్కారానికి ప్రయత్నాలు

శ్రీలంకలో శాంతిభద్రతలు నెలకొనేలా సాయుధ బలగాలకు, పోలీసులకు మద్దతుగా నిలవాలని శ్రీలంక ఆర్మీ చీఫ్‌ జనరల్‌ శవేంద్ర శిల్వ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు.

crisis in Sri Lanka : శ్రీలంక సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు శ్రీలంక ఆర్మీ రంగంలోకి దిగింది. శాంతియుత పరిష్కారానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రజలను శాంతింపచేసే పనిలో శ్రీలంక సైన్యం పావులు కదుపుతోంది. మరిన్ని తిరుగుబాట్లు జరగకుండా ఆర్మీ జాగ్రత్తలు తీసుకుంటోంది. శ్రీలంకలో శాంతిభద్రతలు నెలకొనేలా సాయుధ బలగాలకు, పోలీసులకు మద్దతుగా నిలవాలని శ్రీలంక ఆర్మీ చీఫ్‌ జనరల్‌ శవేంద్ర శిల్వ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు అధ్యక్షుడు గొటబాయ ఎక్కడున్నారాన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. గొటబాయ నేవీ షిప్‌లో ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుండగా.. శ్రీలంక నేవీ షిప్‌లో గొటబాయ లగేజీ కనిపించినట్లు సమాచారం. గజాబహు షిప్‌లో గొటబాయ ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఇక కొలంబో ఎయిర్‌పోర్టు నుంచి పారిపోయాడంటూ కథనాలు వెలువడుతున్నాయి. గొటబాయను ఆయన మద్దతుదారులు దాచిపెట్టారని నిరసనకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Sri Lanka: ఓ వైపు ఆర్థిక సంక్షోభం.. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో కోట్లాది రూపాయలు బయటపడ్డ వైనం

మరోవైపు శ్రీలంకకు బెయిలవుట్‌ ప్యాకేజీపై కసరత్తులు చేస్తున్న ఐఎంఎఫ్‌ తాజా పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. త్వరలోనే ఈ రాజకీయ సంక్షోభానికి పరిష్కారం లభించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. అప్పుడే బెయిలవుట్‌ ప్యాకేజీపై నిలిచిపోయిన చర్చలు తిరిగి పునరుద్ధరించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపింది.

ఇప్పటి వరకు ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుత ప్రధాని విక్రమ సింఘేతో ఐఎంఎఫ్‌ తొలి విడత చర్చలు జరిపింది. కొన్ని ఆర్థిక విధానాలపైన ఇరుపక్షాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. ఆగస్టులో పూర్తి స్థాయి ఒప్పందం ఖరారై బెయిలవుట్‌ ప్యాకేజీ మంజూరయ్యే అవకాశం ఉందని ప్రధాని ఇటీవలే ప్రకటించారు.

Sri Lanka Crisis: నేను కొనసాగలేను.. శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే రాజీనామా.. అదే బాటలో గొటబయ?

ఈలోపే సంక్షోభం ముదిరి ప్రజాగ్రహం పెల్లుబికడంతో ఆయన రాజీనామా చేశారు. కొత్త ప్రధాని ఆ బాధ్యతల్లోకి వచ్చే వరకు సాంకేతికపరమైన చర్చల్ని ఆర్థిక శాఖలోని అధికారులతో కొనసాగిస్తామని ఐఎంఎఫ్ ప్రకటించింది. శ్రీలంకలో ఆగస్టు నెలలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈలోపు పరిస్థితలు చక్కపడతాయని ఐఎంఎఫ్ భావించగా.. సీన్‌ మళ్లీ మొదటికి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు