Sri Lanka: ఓ వైపు ఆర్థిక సంక్షోభం.. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో కోట్లాది రూపాయలు బయటపడ్డ వైనం

ఆర్థిక సంక్షోభంతో ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోన్న శ్రీలంకలో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున రోడ్ల‌పైకి వ‌చ్చి ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. ఆందోళ‌న‌కారులు నిన్న శ్రీ‌లంక అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స ఇంట్లోకి దూసుళ్లిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వారికి ఆ ఇంట్లో కోట్లాది రూపాయ‌ల డ‌బ్బు క‌న‌ప‌డింది.

Sri Lanka: ఓ వైపు ఆర్థిక సంక్షోభం.. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో కోట్లాది రూపాయలు బయటపడ్డ వైనం

Srilanka Crisis (2)

Sri Lanka: ఆర్థిక సంక్షోభంతో ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోన్న శ్రీలంకలో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున రోడ్ల‌పైకి వ‌చ్చి ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. ఆందోళ‌న‌కారులు నిన్న శ్రీ‌లంక అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స ఇంట్లోకి దూసుళ్లిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వారికి ఆ ఇంట్లో కోట్లాది రూపాయ‌ల డ‌బ్బు క‌న‌ప‌డింది. దేశంలో ఎన్న‌డూ లేనంత‌గా ఆర్థిక సంక్షోభం త‌లెత్తిన వేళ ఆయ‌న ఇంట్లో భారీ మొత్తంలో డ‌బ్బు క‌న‌ప‌డ‌డం గ‌మ‌నార్హం.

Gardening: తోట‌పని చేస్తే మాన‌సిక ఆరోగ్యం

శ్రీ‌లంక వార్తా పత్రిక డైలీ మిర్ర‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆందోళ‌న‌కారులు కోట్లాది రూపాయ‌ల డ‌బ్బును గుర్తించి దాన్ని భ‌ద్ర‌తా సిబ్బందికి అందించారు. కొంద‌రు డ‌బ్బును లెక్క‌పెడుతున్న‌ట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం గొట‌బాయ రాజ‌ప‌క్స ఎక్క‌డ ఉన్నారో ఎవ‌రికీ తెలియ‌ట్లేదు. ప్ర‌జ‌ల ఆందోళ‌న‌లు హింసాత్మ‌క రూపు దాల్చ‌డంతో శ్రీ‌లంక‌లో ప‌రిస్థితులు అదుపు త‌ప్పుతున్నాయి. దేశంలో శాంతియుత వాతావరణం కోసం ప్రజలు సహకరించాలని ఆ దేశ ఆర్మీ చీఫ్ కోరారు.