Afghanistan-Taliban Crisis : తజికిస్తాన్ ఆశ్రయమివ్వకపోవడంతో అమెరికాకు అష్రఫ్ ఘనీ
ఆదివారం తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశించి వెంటనే అఫ్ఘానిస్తాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ

Ashraf
Afghanistan-Taliban Crisis ఆదివారం తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశించి వెంటనే అఫ్ఘానిస్తాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ తన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, అప్ఘాన్ భద్రతా సలహాదారుతో కలిసి తజికిస్తాన్ పారిపోయినట్లు నిన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఘనీ తమ దేశంలోకి వచ్చాడన్న వార్తలను తజికిస్తాన్ ఖండించింది. అష్రఫ్ ఘనీ విమానం తమ దేశ గగనతలంలోకి ప్రవేశించలేదని,తమ దేశ భూభాగంలో ఘనీ విమానం ల్యాండ్ అవలేదని తజికిస్తాన్ విదేశాంగశాఖ తెలిపింది.
అయితే తజికిస్తాన్ లో అష్రఫ్ విమానం ల్యాండింగ్ కు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో…ఒమన్ దేశానికి అప్రష్ ఘనీ వెళ్లినట్లు సమాచారం. కాగా,ప్రస్తుతం ఒమన్ లో ఉన్న అష్రఫ్ ఘనీ అమెరికా వెళ్లేందుకు రెడీ అయినట్లు తెలుస్తొంది. మరికొద్ది గంటల్లో అఫ్రఫ్ ఘనీ విమానం అమెరికాలో ల్యాండ్ కానున్నట్లు సమాచారం.
కాగా,ఆదివారం అష్రఫ్ ఘనీ తన సుదీర్ఘ ఫేస్‌బుక్ పోస్ట్‌లో..అప్ఘాన్ నుంచి ఎందుకు వెళ్లిపోవలసి వచ్చిందో వివరించారు. రక్తపాతాన్ని నివారించడానికే తాను రాజధాని నగరాన్ని విడిచిపెట్టినట్లు చెప్పారు. తీవ్రవాద గ్రూప్(తాలిబన్)..కత్తులు మరియు తుపాకుల ద్వారా గెలిచిందని, కానీ ఆఫ్ఘన్ ప్రజల హృదయాలను గెలుచుకోలేకపోయిందని ఆయన అన్నారు.