Israeli Strike : ఉత్తర గాజాలో స్కూల్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి.. 28మంది మృతి..!

Israeli Strike : గాజాలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడి చేసింది. ఈ దాడిలో పిల్లలతో సహా కనీసం 28 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించారు.

Israeli Strike : ఉత్తర గాజాలో స్కూల్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి.. 28మంది మృతి..!

Atleast 28 Killed After Israeli Strike Hits School, Says Gaza Ministry ( Image Source : Google )

Updated On : October 17, 2024 / 7:20 PM IST

Israeli Strike : ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడి చేసింది. ఈ దాడిలో పిల్లలతో సహా కనీసం 28 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ మేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించారు. అయితే, ఈ స్కూల్లోని పదుల సంఖ్యలో మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడిలో డజన్ల కొద్ది గాయపడ్డారని అధికారి మేధాత్ అబ్బాస్ అన్నారు. ఇజ్రాయెల్ ఊచకోతకు అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు.

హమాస్, ఇస్లామిక్ జిహాద్ గ్రూపులకు చెందిన మిలిటెంట్లే లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ఒక ప్రకటనలో తెలిపింది. జబాలియాలోని అబూ హుస్సేన్ పాఠశాలలో వందలాది మంది పౌరులు ఆశ్రయం పొందుతున్నారు. వైమానిక దాడి జరిగిన కాంపౌండ్‌లో డజన్ల కొద్దీ మిలిటెంట్లు ఉన్నారని, వారిలో కనీసం 12 మందిని గుర్తించినట్టు నివేదిక పేర్కొంది. పౌరులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు మిలిటరీ పేర్కొంది. హమాస్ ఆధ్వర్యంలోని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం పాఠశాలలో మరణించిన వారి సంఖ్యను 28గా పేర్కొంది.

వైమానిక దాడిలో 160 మంది గాయపడ్డారని పేర్కొంది. అంతకుముందు పాలస్తీనా అధికారులు గాజా నగరంలో రెండు వేర్వేరు ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 11 మంది పాలస్తీనియన్లు మరణించారని వెల్లడించారు. మధ్య, దక్షిణ గాజా ప్రాంతాల్లో పలువురు మరణించారని పేర్కొన్నారు. గాయపడినవారిని అంబులెన్స్‌లతో సమీప ఆస్పత్రులకు తరలించారు. గాజాలో ఆరోగ్య శాఖ గణంకాల ప్రకారం.. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 42వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.

Read Also : Salman Khan : సల్మాన్ ఖాన్‌ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్ట్..