Salman Khan : సల్మాన్ ఖాన్‌ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్ట్..

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌ను హ‌త్య చేసేందుకు రూ.25ల‌క్ష‌ల ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు న‌వీ ముంబై పోలీసులు దాఖ‌లు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.

Salman Khan : సల్మాన్ ఖాన్‌ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్ట్..

RS 25 Lakh Contract For Salman Khan Hit AK 47 From Pak Chargesheet

Updated On : October 17, 2024 / 4:23 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌ను హ‌త్య చేసేందుకు రూ.25ల‌క్ష‌ల ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు న‌వీ ముంబై పోలీసులు దాఖ‌లు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. మహారాష్ట్రలోని పన్వెల్‌లోని స‌ల్మాన్ ఫామ్ హౌస్‌లోనే అత‌డిని హ‌త్య చేయాల‌ని అనుకున్న‌ట్లు తెలిపారు. ఐదుగురు వ్య‌క్తులు జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ముఠా ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

పాకిస్థాన్ నుంచి అత్యాధునిక ఆయుధాలు ఏకే 47, ఏకే 92, ఎమ్ 16 వంటివి కొనుగోలు చేసేందుకు నిందితులు సిద్ధం అయ్యార‌ని అందులో తెలిపారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు ఉప‌యోగించిన ట‌ర్కీలో త‌యారు చేసిన జిగానా ఆయుధాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధం అయ్యార‌న్నారు. మైనర్లను షార్పు షూటర్లుగా వాడేందుకు ఈ గ్యాంగ్‌ ఏర్పాట్లు చేసుకున్న‌ట్లు తెలిపారు. వీరంతా పూణే, రాయ్‌గఢ్, నవీ ముంబై, థానే, గుజరాత్‌లలో తలదాచుకుంటున్నారని తెలిపారు.

Sobhan Babu : వాట్.. శోభన్ బాబు ఫ్యామిలీ సినీ పరిశ్రమలో ఉన్నారా..? ఆయన మా పెదనాన్న అంటూ..

దాదాపు 60 నుంచి 70 మంది ముంబైలోని బాంద్రా ఇంటిని, ప‌న్వెల్‌లోని ఫామ్‌హౌస్‌తో పాటు గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటిలో సల్మాన్ క‌దలిక‌ల‌ను ట్రాక్ చేస్త‌న్న‌ట్లు ఛార్జ్‌షీట్ పేర్కొంది. ఆగస్టు 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య ప్లాన్ స‌ల్మాన్‌ను చంపేందుకు ప్లాన్ జ‌రిగింద‌ని తెలిపింది.

గురువారం హర్యానాలోని పానిపట్‌లో అరెస్టయిన సుఖా, కుట్రలో పాల్గొన్న షూటర్ అజయ్ కశ్యప్ అలియాస్ ఎకెతో పాటు మరో నలుగురు కుట్ర‌లో భాగం అయిన‌ట్లు దర్యాప్తులో వెల్లడైంది. స‌ల్మాన్‌కు గ‌ట్టి భ‌ద్ర‌త‌, బుల్లెట్ ఫ్రూఫ్ వాహ‌నాల కార‌ణంగా అత్యాధునిక ఆయుధాలు అవ‌స‌రం అవస‌రం అవుతాయ‌ని క‌శ్య‌ప్‌, అత‌డి బృందం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. దీంతో ఆయుధాల కోసం పాకిస్థాన్‌కు చెందిన ఆయుధ వ్యాపారి డోగ‌ర్‌ను సంప్ర‌దించిన‌ట్లుగా తెలిపింది.

Prakash Raj – Pawan Kalyan : ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్.. OG సినిమాలో ఇద్దరూ కలిసి..?

ఇక స‌ల్మాన్‌ను హ‌త్య చేసిన త‌రువాత నిందితులు క‌న్యాకుమారికి వెళ్లి అక్క‌డి నుంచి ప‌డ‌వ‌లో శ్రీలంక‌కు వెళ్లాల‌ని, ఆ త‌రువాత భార‌త నిఘా సంస్థ‌లు చేర‌లేని ప్ర‌దేశానికి వెళ్లాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ని ఛార్జిషీట్ లో వివ‌రించారు.