Sobhan Babu : వాట్.. శోభన్ బాబు ఫ్యామిలీ సినీ పరిశ్రమలో ఉన్నారా..? ఆయన మా పెదనాన్న అంటూ..

తాజాగా ఓ లేడి డైరెక్టర్, నిర్మాత తాను శోభన్ బాబు ఫ్యామిలీ అని, శోభన్ బాబు నాకు పెదనాన్న అవుతారని చెప్పింది.

Sobhan Babu : వాట్.. శోభన్ బాబు ఫ్యామిలీ సినీ పరిశ్రమలో ఉన్నారా..? ఆయన మా పెదనాన్న అంటూ..

Director Producer Haritha Gogineni says Sobhan babu is her Relative Comments goes Viral

Updated On : October 17, 2024 / 3:59 PM IST

Sobhan Babu : అందగాడు, దివంగత నటుడు శోభన్ బాబు గురించి అందరికి తెలిసిందే. హీరోగా అయన ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించారు. కానీ వయసు పైబడ్డాక సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుటుంబంలో ఎవర్ని సినీ పరిశ్రమ వైపుకు రానివ్వలేదు. కానీ తాజాగా ఓ లేడి డైరెక్టర్, నిర్మాత తాను శోభన్ బాబు ఫ్యామిలీ అని, శోభన్ బాబు నాకు పెదనాన్న అవుతారని చెప్పింది.

గతంలో లక్కీ లక్ష్మణ్ అనే సినిమా తీసిన నిర్మాత హరిత గోగినేని త్వరలో ఫియర్ అనే సినిమాతో డైరెక్టర్ గా రాబోతుంది. ఈమె సినిమాల్లోకి రాకముందు ఆస్ట్రాలజీలో డాక్టరేట్ చేసింది. త్వరలో వేదికతో ఫియర్ అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శోభన్ బాబు గురించి మాట్లాడింది.

Also Read : Prakash Raj – Pawan Kalyan : ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్.. OG సినిమాలో ఇద్దరూ కలిసి..?

హరిత గోగినేని మాట్లాడుతూ.. శోభన్ బాబు గారు నాకు వరసకు పెదనాన్న అవుతారు. మా సొంత ఫ్యామిలీ కాదు కానీ రిలేటివ్స్ అవుతారు. నాకు, ఆయనకు మంచి మెమరీస్ ఉన్నాయి. మా తాతయ్య ఊరు చిన నందిగామ. శోభన్ బాబు గారిది కూడా అదే ఊరు. వాళ్ళది అక్కడ పెద్ద ఇల్లు ఉంది. మా తాతయ్యకి శోభన్ బాబు గారు బాగా క్లోజ్. నేను అలా ఆయన ద్వారా క్లోజ్ అయ్యాను శోభన్ బాబు గారితో. నేను హాలిడేస్ వస్తే అక్కడికే వెళ్లేదాన్ని. ఎవరన్నా అడిగితే తప్ప నేను ఈ విషయం బయట చెప్పుకొను. ఆయన నాకు ఒక వ్యక్తిగా ఇష్టం. ఆయన నాతో చిన్నపుడు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు. అన్ని విషయాలు చెప్పేవాళ్ళు. నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టేవాళ్ళు. చివరిసారిగా ఆయన చనిపోయే రెండు నెలల ముందు చెన్నైలో కలిసాను. అప్పుడు అమెరికా వెళ్తుండటంతో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. చిన్నప్పుడు సినిమా ఫీల్డ్ కి దూరంగా ఉండమన్నారు. కానీ ఈ ఫీల్డ్ లోకే వచ్చాను అని తెలిపింది.