ఆస్ట్రేలియాలో కార్చిచ్చు : బీర్లతో బాధితుల దాహం తీరుస్తున్న నేవీ!

  • Published By: sreehari ,Published On : January 10, 2020 / 11:25 AM IST
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు : బీర్లతో బాధితుల దాహం తీరుస్తున్న నేవీ!

Updated On : January 10, 2020 / 11:25 AM IST

ఆస్ట్రేలియాలో కార్చిచ్చులో చిక్కుకున్న వందలాది మంది నివాసితులను రక్షిస్తోంది ఆ దేశపు నేవీ బృందం. ఆగ్నేయ తీరప్రాంతంలో ఆస్ట్రేలియా నేవీ శుక్రవారం (జనవరి 10, 2020)నాడు కొత్త మిషన్ మొదలు పెట్టింది. బీర్ల కొరతతో అల్లాడిపోతున్న కంట్రీ పబ్ కు టిన్నుల కొద్ది బీర్ల కంటైనర్లను పంపిణీ చేస్తోంది. కార్చిచ్చు తీవ్రత రోజురోజుకీ పెరుగుతుండటంతో మల్లాకూట టౌన్ నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు మిలటరీ విభాగం తరలిస్తోంది.

కొత్త ఏడాది రోజు నుంచి అక్కడ చిక్కుకున్న కుటుంబాలను ఒక్కొక్కరిగా తరలించేందుకు మిలటరీ దళాలు ల్యాండింగ్ క్రాఫ్ట్‌ను పంపుతున్నాయి. ఈ క్రమంలో బాధితులకు అవసరమైన నిత్యవసర వస్తువులను కూడా పంపిణీ చేస్తోంది. అంతేకాదు.. దాహంతో అల్లాడిపోతున్న బాధితులకు కార్గో టిన్నుల్లో బీర్లను పంపిణీ చేస్తున్నట్టు రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

HMAS చౌలేస్‌ షిప్‌లోని స్థలం బీర్ టిన్నులతో నిండిపోదని, దీని కోసం అవసరమైన పదార్థాలను అన్ లోడ్ చేయాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మాల్లాకూటా హోటల్లో బీర్ల కొరత తలెత్తడంతో అత్యవసరంగా అల్కాహాల్ ను హోటల్ కు తరలించేందుకు సెర్బీరస్ నేవీ బేస్ వద్ద బీర్ల కంటైనర్లను పంపిణీ చేసినట్టు కార్లటాన్, యూనైటెడ్ బ్రీవరీలు తెలిపాయి.

ఇందులో నాలుగు ప్యాలెట్ల బీర్, సైడర్ తో పాటు మొత్తం 20 కెగ్ ల బీర్ ను దాదాపు 1000 మంది జనాభా ఉన్న మాల్లాకూటా నగరానికి పంపిణీ చేశారు. ఎప్పుడూ బీర్ తాగే అలవాటున్న ఆస్ట్రేలియన్లకు కొద్దిరోజులుగా బీర్ల కొరత వేధిస్తోంది.

అవసరమైన సమయంలో ఆ పబ్ లో బీర్ కొరత ఏర్పడటం విచారకరమని కార్లటాన్, యూనైటెడ్ బ్రీవరీస్ సీఈఓ పీటర్ ఫిలిపోవిక్ చెప్పారు. మాల్లాకూటా నివాసితులు కార్చిచ్చుతో అల్లాడిపోతున్నారని, వారికి బీర్ అందించడం వల్ల కనీసం ఉపశమనంగా ఫీల్ అవుతారని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

మునుపెన్నడూ దేశీయ పౌరులకు నేవీ బృందం బీర్లు పంపిణీ చేసిందో లేదో తెలియదు కానీ, ఈ కార్చిచ్చు అత్యంత ప్రమాదకరమైన విపత్తుగా ఆయన పేర్కొన్నారు. 16వేల టన్నుల రిలీఫ్ HMAS Choules ల్యాండింగ్ షిప్ బీర్ కంటైనర్లతో మాల్లాకూటాకు తిరిగి చేరుకోనుందని రక్షణ శాఖ తెలిపింది.