2025లో జరిగే అరిష్టాలు, విధ్వంసాలు ఇవే.. టైమ్ ట్రావెల్‌ చేసొచ్చి మరీ.. తేదీలతో పాటు చెబుతున్నాడట ఇతడు.. 

రెండో అంతర్యుద్ధం ప్రారంభమవుతుందని, అంతా నాశనం అవుతుందని చెప్పాడు.

2025లో జరిగే అరిష్టాలు, విధ్వంసాలు ఇవే.. టైమ్ ట్రావెల్‌ చేసొచ్చి మరీ.. తేదీలతో పాటు చెబుతున్నాడట ఇతడు.. 

Updated On : March 2, 2025 / 5:02 PM IST

బాబా వంగా, నోస్ట్రాడామస్ వంటి వారు భవిష్యవాణి చెబుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. వారు చెప్పేది నిజమో, ఊహాజనితమో కానీ వారిద్దరు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించారు. ఇప్పుడు తనను తాను టైమ్‌ ట్రావెలర్‌గా చెప్పుకుంటూ ఎల్విస్ థాంప్సన్ అనే ఓ వ్యక్తి చెప్పిన భవిష్యవాణి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రపంచంలో 2025లో జరిగే అరిష్టాల గురించి ఆన్‌లైన్‌లో అతడు చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు ఒక వీడియో రూపంలో భవిష్యవాణి చెప్పగా దానికి ఇప్పటికే 26 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఏ తేదీకి ఏ విపత్తు జరుగుతుందో కూడా చెప్పాడు.

ఏ రోజు ఏ విపత్తు ముంచుకొస్తుంది?

ఏప్రిల్ 6: అమెరికాలోని ఒక్లహోమాలో 24 కిలోమీటర్ల వెడల్పయిన టోర్నడో గంటకు 1,046 కి.మీ. వేగంతో దూసుకెళ్తూ విధ్వంసం సృష్టిస్తుంది.

మే 27: అమెరికాలో రెండో అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది. ఇది టెక్సాస్ విడిపోవడానికి, అణు ఘర్షణలకు దారితీస్తుంది. అమెరికాను శిథిలావస్థకు తెస్తుంది.

సెప్టెంబర్ 1: ఛాంపియన్ అనే ఏలియన్ భూమిపైకి వచ్చి 12,000 మంది మానవులను వారి భద్రత కోసం మరొక గ్రహానికి తీసుకువెళుతుంది. భూమికి హాని కలిగించే గ్రహాంతరవాసులు ఉన్నారని కూడా థాంప్సన్ చెప్పాడు.

సెప్టెంబర్ 19: అమెరికా తూర్పు తీరాన్ని ఒక శక్తివంతమైన తుపాను ముంచెత్తుతుంది. దీని వల్ల భారీ విధ్వంసం జరుగుతుంది.

నవంబర్ 3: పసిఫిక్ మహాసముద్రంలో సెరీన్ క్రౌన్ అనే నీలి తిమింగలం కంటే ఆరు రెట్ల పరిమాణం ఎక్కువగా ఉండే సముద్ర జీవిని గుర్తిస్తారు.

థాంప్సన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆయన వేసిన అంచనాలను ఎగతాళి చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు. “టైమ్ ట్రావెల్‌ చేసి భవిష్యత్తుకు వెళ్లి వచ్చావు సరే. వచ్చే వారం ఏ లాటరీకి ప్రైజ్‌ వస్తుందో చెప్పు. ఆ లాటరీ కొని పెట్టుకుంటా” అని ఓ యూజర్ సెటైర్ వేశాడు.

థాంప్సన్ పోస్ట్ చేసిన వీడియోను సేవ్ చేసుకుంటానని, అతడు చెప్పిన జోస్యం తప్పయితే కోర్టుకు వెళ్తానని ఓ యూజర్ హెచ్చరించాడు. థాంప్సన్ లాంటి వారి మాటలను నమ్మేవారు ఈ కాలంలో లేరని కొందరు కామెంట్లు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Elvis Thompson (@elvis.thompson.927)