Banana Phobia: మహిళా మంత్రికి ‘బనానా ఫోబియో’.. అరటి పండు కనిపిస్తే వణికిపోతుంది

మంత్రి పౌలినా బ్రాండ్ బర్గ్ కు అరటి పండు అంటే చిన్నప్పటి నుంచి అస్సుల నచ్చదట. దీంతో ఆమె కు ఏర్పాటు చేసే గదుల్లోనూ ..

Banana Phobia: మహిళా మంత్రికి ‘బనానా ఫోబియో’.. అరటి పండు కనిపిస్తే వణికిపోతుంది

Swedish Minister Paulina Brandberg

Updated On : November 15, 2024 / 9:11 AM IST

Swedish Minister Paulina Brandberg: అరటి పండు ఇస్తే ఎవరైనా లొట్టలేసుకొని తినేస్తారు. ఈ పండు ఆరోగ్యకరమైనదేకాక.. శుభకార్యాల్లో ఈ పండును విరివిగా వినియోగస్తుంటారు. చాలా మందికి అరటి పండు తినందే రోజు గడవదు అనే పరిస్థితి ఉంటుంది. అంతేకాదు.. దేవుడికి నైవేద్యంలోనూ అరటి పండును అందిస్తుంటారు. అయితే, ఓ మహిళా మంత్రికి అరటి పండు కనిపిస్తే చాలు.. దాని దరిదాపుల్లోకి కూడా రాదట. ఆమె ఎవరో కాదు.. స్వీడన్ కు చెందిన మహిళా మంత్రి ఫౌలినా బ్రాండ్ బర్గ్. అక్కడి ప్రభుత్వంలో ఆమె లింగ సమానత్వం మంత్రిగా పనిచేస్తున్నాడు. ఈమెకు అరటి పండు ఫోబియా ఉందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: New Zealand : హాకా నృత్యం చేస్తూ పార్లమెంట్‌లో రచ్చ చేసిన మహిళా ఎంపీ.. వీడియో వైరల్

తనకు అరుదైన ఫోబియా ఉన్నట్లు గతంలో ఎక్స్ లో ఆమె వెల్లడించారు. ఆ తరువాత కొద్ది గంటల్లోనే ఆ పోస్టును డిలీట్ చేశారు. ఆమె అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు.. ఆమె సిబ్బంది ముందుగానే స్థానికులకు అరటి పండును దరిదాపుల్లో ఉంచొద్దని సూచిస్తున్నారట. తాజాగా.. మంత్రి అధికారిక పర్యటనకు సంబంధించి.. సదరు మంత్రిత్వ శాఖ సిబ్బంది ఈ- మెయిల్ స్థానికులకు అరటి పండు ఉంచొద్దని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

 

మంత్రి పౌలినా బ్రాండ్ బర్గ్ కు అరటి పండు అంటే చిన్నప్పటి నుంచి అస్సుల నచ్చదట. దీంతో ఆమె కు ఏర్పాటు చేసే గదుల్లోనూ, వేదికలపై అరటి పండు కనిపించకుండా ఆమె శాఖ సిబ్బంది ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. కొందరికి చిన్నప్పుడే ఇలాంటి ఫోబియా వస్తుందని, దానికి ప్రత్యేక కారణాలు తెలియవని నిపుణులు పేర్కొంటున్నారు.